E-Paper
Advertisement

Kona Venkat: ‘బ్యాండ్ మేళం’ను ఆ చిత్రంతో పోల్చిన కోన వెంకట్.. అయితే హిట్టే!

Kona Venkat: ‘బ్యాండ్ మేళం’ను ఆ చిత్రంతో పోల్చిన కోన వెంకట్.. అయితే హిట్టే!
Advertisement

Kona Venkat: ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాండ్ మేళం’ (Band Melam). మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ (Kona Venkat) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను మార్చి 13న విడుదల చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంఛ్ వేడుకకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్‌తో పాటు, ‘కోర్ట్’ చిత్రంలో ఈ హీరోహీరోయిన్లతో ఆడుకున్న శివాజీ, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, వేణు ఊడుగుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడుతూ.. ఈ ‘బ్యాండ్ మేళం’ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని హిట్ సినిమాతో పోల్చారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ..

Also Read- Poonam Kaur: పవన్ కళ్యాణ్‌పై మరో బాంబ్ పేల్చిన పూనమ్ కౌర్.. ఈసారి టార్గెట్ పిల్లలు!

క్లైమాక్స్ కట్టి పడేస్తుంది

Advertisement

‘‘గుండెలో నుంచి వచ్చే ప్రేమ కథకు ఎలాంటి ఆదరణ దక్కుతుందనేది నాకు ‘నిన్ను కోరి’ సినిమాతో తెలిసింది. ‘నిన్ను కోరి’ సినిమా వల్లే ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ సినిమాను నిర్మించాను. నాని ఫిల్మోగ్రఫీలో ‘నిన్ను కోరి’ ఓ మెమరబుల్ ఫిల్మ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. శివ నిర్వాణ ఆ కథను గుండెతో చెప్పాడు. నాకు సతీష్ ఈ కథను చెప్పినప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే ఫీలింగ్ కలిగింది. ఈ కథలోని సంఘర్షణ చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించని విధంగా.. అందరినీ కట్టి పడేస్తుంది. ఏజ్, యాక్టింగ్ సత్తా ఉండటం వల్లే రోషన్, శ్రీదేవీలను తీసుకున్నాం. సాయి కుమార్ ఈ కథను విని షాక్ అయ్యారు. విజయ్ బుల్గానిన్ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. మార్చి 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ ఈ సినిమాను సక్సెస్ చేసి, ఇంకా కొత్త వారిని పరిచయం చేసే శక్తిని, సక్సెస్‌ను అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Peddi Business: ఏపీలో ఊహించని స్థాయిలో ‘పెద్ది’ బిజినెస్.. ఇదే హాట్ టాపిక్!

పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ

Advertisement

చిత్ర హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. ‘బ్యాండ్ మేళం’ పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ. ఇందులో ప్రతీ ఎమోషన్‌ను పీక్‌లో చూపించే పాత్ర దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. మా కోసం వచ్చిన గెస్ట్‌లందరికీ థ్యాంక్స్. మార్చి 13న ‘బ్యాండ్ మేళం’ రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండని కోరారు. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ‘కోర్ట్’తో మా అందరినీ ఎంతలా ఆదరించారో ‘బ్యాండ్ మేళం’ని కూడా అలానే ఆదరిస్తారని, ప్రేమ చూపిస్తారని కోరుకుంటున్నాను. మా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమాను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Spirit Villain: ‘స్పిరిట్’ విలన్‌గా డాన్ లీ? క్లారిటీ వచ్చేది ఆ రోజేనా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×