E-Paper
Advertisement

Spirit Villain: ‘స్పిరిట్’ విలన్‌గా డాన్ లీ? క్లారిటీ వచ్చేది ఆ రోజేనా?

Spirit Villain: ‘స్పిరిట్’ విలన్‌గా డాన్ లీ? క్లారిటీ వచ్చేది ఆ రోజేనా?
Advertisement

Spirit Villain: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ అవతారంలో కనిపించబోతున్నాడని తెలియడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు అంతకు మించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో షేక్ చేస్తోంది. అదేంటంటే.. కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ (Don Lee) ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా చేస్తున్నారనే వార్త! గత కొంతకాలంగా సోషల్ మీడియాలో డాన్ లీ పేరు వినబడుతున్నా, మేకర్స్ మాత్రం గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఇటీవల ఒక ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగాను ఫ్యాన్స్ ఈ విషయంపై గట్టిగా నిలదీయగా, ఆయన నవ్వుతూ.. ‘మీరు అనుకున్నట్టే జరుగుతుంది.. కొంచెం వెయిట్ చేయండి’ అని హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Also Read- Nayan Sarika: ‘విష్ణు విన్యాసం’ వారికి ఫస్టాఫ్ బోర్ కొడుతుంది.. ఇదేంటి పుసుక్కున ఇలా చెప్పేసింది

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఆ రోజేనా?

Advertisement

ఆయన ఇచ్చిన ఈ అప్డేట్‌ తర్వాత మళ్లీ డాన్ లీ గురించి ఎటువంటి చర్చా జరగలేదు. ఇప్పుడా అప్డేట్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. కొరియన్ యాక్షన్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాన్ లీ, ప్రభాస్ లాంటి భారీ కటౌట్‌ను ఢీకొంటే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అలాంటి కిక్కు ఇచ్చినట్లుగా ఇచ్చి, వివరం తెలపకపోతే? అలాగే రేపు సినిమాలో అతను లేకపోతే? ఇవే ఫ్యాన్స్‌ని బాగా ఆలోచింపజేస్తున్నాయి. కాబట్టి.. దీనిపై ఓ క్లారిటీ కావాలని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ వచ్చేది మాత్రం ఆ రోజే అంటూ, ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి 1న డాన్ లీ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ నుంచి ఏదైనా స్పెషల్ పోస్టర్ లేదా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది.

Also Read- The Paradise: ఊర మాస్ స్టెప్స్‌తో షేర్ ఆగయా.. సాంగ్ ఎలా ఉందంటే?

గ్లోబల్ రేంజ్ యాక్షన్ కాప్ డ్రామా..

Advertisement

ఒకవేళ ఇదే నిజమైతే, ‘స్పిరిట్’ మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్ళిపోవడం ఖాయం. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ వంటి ఇతర తారాగణం కూడా ప్రాజెక్టులో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ డాన్ లీ విలన్‌గా ఫిక్స్ అయితే, కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్లను కూడా రంగంలోకి దింపే ఆలోచనలో వంగా ఉన్నారట. ప్రభాస్ 25వ సినిమాగా రాబోతున్న ఈ గ్లోబల్ రేంజ్ యాక్షన్ కాప్ డ్రామాతో.. బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నింటినీ గల్లంతవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఉన్నారు. మరి వారి ఆశలను సందీప్ వంగా ఏం చేస్తాడో చూడాలి.

Also Read- Virosh premiere league:  విరోష్ ప్రీమియర్ లీగ్.. ఫోటోలు షేర్ చేసిన రష్మిక!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×