E-Paper
Advertisement

నాదగ్గర రూపాయి కూడా లేదు..రూ.100 కోట్ల ఆస్తి మొత్తం ఆమెకే రాసేశా.. పోసాని సంచలన వ్యాఖ్యలు

నాదగ్గర రూపాయి కూడా లేదు..రూ.100 కోట్ల ఆస్తి మొత్తం ఆమెకే రాసేశా.. పోసాని సంచలన వ్యాఖ్యలు
Advertisement

Posani Journey : పోసాని కృష్ణ మురళి…పరిచయం అక్కర్లేని పేరిది. సినీ ఇండస్ట్రీలో ఎంత ముక్కు సూటిగా ఉండేవారో, రాజకీయాల్లోనూ అదే సూటిగా వ్యవహరించి ఇబ్బందుల పాలయ్యారు. ఇక ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉన్నపోసాని ప్రస్తుతం ఆపరేషన్ అరుణా రెడ్డి అనే సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించిన సంగతి తెల్సిందే. ఇక ఈ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని తన జీవితం , తను ఫేస్ చేసిన ఆర్ధిక ఇబ్బందులు, తన ఫ్యామిలీపై తనకున్న ప్రేమని చెప్పుకొచ్చాడు.ఈక్రమంలోనే తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలని ఇలా బయట పెట్టేశాడు.

తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ 

Advertisement

కేవలం 50రూపాయల  అప్పు పుట్టకపోవడంతో తన తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటనను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయిపోయాడు పోసాని. తన తండ్రి భోళాశంకరుడని, ఎవరో పేకాట నేర్పించడంతో ఆస్తులన్నీ పోగొట్టుకుని చివరకు తాటాకు ఇల్లు మాత్రమే మిగిల్చారని మనసులోని బాధని బయట పెట్టాడు.మన ఇంట్లో డబ్బు లేదు, మనం పేదవాళ్లం అనే బాధతోనే ఆయన చ్జనిపోయారని, ఆ పేదరికమే తనను కష్టపడి సంపాదించేలా చేసిందని చెప్పాడు. చదువుకునే రోజుల్లో ఫీజుల కోసం గుంటూరులోని ఒక సినిమా థియేటర్‌లో నేల, బెంచి కౌంటర్లలో టికెట్లు అమ్మినట్లు వెల్లడించారు. బస్సు ఛార్జీలు ఆదా చేయడానికి సెకండ్ షో అయ్యాక లారీల్లో ఊరికి వెళ్లేవాడినని, డిగ్రీ చదువుతూ రోజుకు రూ.7 కూలీకి టమోటా తోటల్లో పని చేశానని తన గతాన్ని తలుచుకున్నాడు.

తక్కువ సమయంలోనే 100 సినిమాలకు

Advertisement

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాక పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్‌గా చేరి, వారు చెప్పిన ప్రతి పనినీ ఎంతో క్రమశిక్షణతో చేశానని . తక్కువ సమయంలోనే దాదాపు 100 సినిమాలకు రచయితగా పనిచేసి రికార్డు సృష్టించానని తెలిపాడు. అయితే సినిమా కంటే తనకు డబ్బు, పని మీదనే ఎక్కువ ప్రేమ అని ఓపెన్‌గా ఒప్పుకున్న పోసాని, ప్రస్తుతం తనకు రూ.100 కోట్లకు పైగా ఆస్తి ఉందంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశాడు. అయితే, అంత ఆస్తి ఉన్నప్పటికీ అందులో ఒక్క పైసా కూడా తన పేరు మీద లేదని, మొత్తం ఆస్తిని తన భార్య పేరిట రాసేశానని చెప్పుకొచ్చాడు. తన పేరు మీద అర్ధ రూపాయి కూడా లేదని, భార్యపై ఉన్న ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, తనకు లక్ష కోట్ల కంటే విలువైన కుటుంబం దొరికిందని, 33 ఏళ్ల వైవాహిక జీవితంలో తనకు ఒక్క బాధ కూడా కలగలేదని సంతోషం వ్యక్తం చేశాడు.

also read :అల్ట్రా స్టైలిష్ లుక్ అంటూ బాలయ్యతో కొరటాల ప్రయోగం.. గత చేదు జ్ఞాపకాలు రిపీట్ అవుతాయా?

డబ్బును వృధా చేయకూడదని నమ్మే పోసాని, ఇప్పటివరకు సుమారు రూ.2 కోట్ల వరకు దానధర్మాలు చేశానని, ఎంతోమంది పేదవారికి హార్ట్ సర్జరీలు చేయించానని తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉండాల్సి వస్తే, ఇల్లు క్లీన్ చేసే పని ఇచ్చినా సిగ్గుపడకుండా చేస్తానని, కష్టపడి బతకడమే తన నైజమని కుండ బద్దలు కొట్టేశాడు.

కెరీర్‌ను మలుపు తిప్పిన నటన

పోసాని సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పవిత్ర బంధం’ (1996), ‘పెళ్ళిచేసుకుందాం’ (1997), ‘గణేష్’ (1998) వంటి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకి ఆయనే కథ, మాటలు అందించారు. ఇక ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘శ్రావణమాసం’ (2005),ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలను తెరకెక్కించారు కూడా.అయితే, ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం నటనే అని చెప్పాలి.గతి లేక ‘బాబీ’ (2002) సినిమాలో ఒక చిన్న వేషం వేస్తే, అది కాస్తా ఆయనలోని నటుడిని బయటకు తీసి, దాదాపు 500 సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టడం విశేషం. ముఖ్యంగా ‘నాయక్’, ‘టెంపర్’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి.

ఏది ఏమైనా ఒక సాధారణ కూలీ నుంచి ఈ స్థాయికి ఎదిగిన పోసాని సింప్లిసిటీ, ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే !

also read :లోకేశ్‌తోనే మొదలుపెడదాం…చంద్రబాబు ‘పాపులేషన్’ కామెంట్స్‌పై పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×