E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

‘రాజా సాబ్’ దెబ్బకి డార్లింగ్ రూట్ మార్చాడా? 2027లో ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర..

‘రాజా సాబ్’ దెబ్బకి డార్లింగ్ రూట్ మార్చాడా? 2027లో ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర..
Advertisement

Prabhas Comeback: ప్రభాస్ సినిమా వస్తోంది అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్ల సునామీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ‘బాహుబలి’ తర్వాత ఆయన ఎంచుకుంటున్న కొన్ని కథలు, స్క్రిప్ట్ సెలెక్షన్స్ మాత్రం ఫ్యాన్స్‌ను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆ మధ్య  విడుదలైన ‘రాజా సాబ్’ సినిమానే దీనికి నిదర్శనం.

ఒక పక్క ప్రభాస్ రేంజ్‌కు తగని హారర్ కామెడీ జానర్ ఎంచుకోవడం, మరోపక్క మేకింగ్ వాల్యూస్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ప్రభాస్ లుక్స్, కథలో బలం లేకపోవడంపై విమర్శకులు సైతం పెదవి విరిచారు. వరుసగా వస్తున్న ఈ అప్ అండ్ డౌన్స్  డార్లింగ్ పాన్ ఇండియా మార్కెట్‌ను దెబ్బతీస్తాయా అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.

ఫౌజీ సమ్మర్లో వస్తుందా ..?

Advertisement

అయితే, ఈ నెగెటివిటీ అంతటికీ 2027 సంవత్సరంలో ప్రభాస్ గట్టి సమాధానం చెప్పబోతున్నాడని ఇన్సైడ్ టాక్. అవును, ఫ్యాన్స్ ఇప్పుడు 2027ను ‘ప్రభాస్ నామ సంవత్సరం’గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే, ఆ ఒక్క ఏడాదిలోనే ఒకటి కాదు.. ఏకంగా మూడు భారీ చిత్రాలు థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ నిజానికి 2026 చివరలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడం, విజువల్ ఎఫెక్ట్స్ కోసం మరికొంత సమయం పడుతుండటంతో ఈ సినిమాను 2027 సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్‌కు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా లేట్ అవ్వడం ఫ్యాన్స్‌కు కాస్త డిసప్పాయింట్  కలిగించే విషయమే అయినా, అవుట్‌పుట్ అద్భుతంగా వస్తోందనే నమ్మకంతో ఉన్నారు.

also read :బాక్సాఫీస్ ‘పెద్ది’ అరాచకం.. 400 కోట్ల క్లబ్‌లో రామ్ చరణ్.. నేడే మెగాస్టార్‌తో కలిసి గ్రాండ్ సక్సెస్ మీట్!

2027 మార్చ్ 5 న రాబోతున్న స్పిరిట్ 

Advertisement

ఈ లైనప్‌లో అత్యంత క్రేజీగా మారిన ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. వివాదాస్పద దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోయే ఈ సినిమాలో ప్రభాస్ ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. సందీప్ మార్క్ వైల్డ్ యాక్షన్, ప్రభాస్ కటౌట్ పడితే థియేటర్లు బద్దలవడం ఖాయం. కానీ, సందీప్ సినిమాల్లో ఉండే మితిమీరిన వయొలెన్స్, నెగెటివ్ షేడ్స్ ప్రభాస్ లాంటి యూనివర్సల్ స్టార్ ఇమేజ్‌కు ఎంతవరకు సెట్ అవుతాయనే ఒక చిన్న భయం కూడా రెబల్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయినప్పటికీ, 2027 మార్చ్ 5 న  రాబోయే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తన నంబర్ వన్ స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటాడా ?

వీటితో పాటు, బాహుబలి ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ కూడా అదే ఏడాది ప్రేక్షకులను పలకరించనుంది. కేవలం యానిమేషన్ రూపంలో రాబోతున్న ఈ సినిమా, లైవ్ యాక్షన్ సినిమాల రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది ఒక పెద్ద సవాల్. ఒకవేళ ఈ మూడు ప్రాజెక్టులు అనుకున్న సమయానికి, పక్కా ప్లానింగ్‌తో 2027లో రిలీజ్ అయితే మాత్రం.. ‘రాజా సాబ్’ లాంటి పరాజయాలు మాయమవ్వడమే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ప్రభాస్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. మరి ఈ మూడు భారీ ట్రీట్స్‌తో ప్రభాస్ మళ్లీ తన నంబర్ వన్ స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి.

Related News

‘పెద్ది’ నా సినిమా కాపీనే.. డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

బాక్సాఫీస్ ‘పెద్ది’ అరాచకం.. 400 కోట్ల క్లబ్‌లో రామ్ చరణ్.. నేడే మెగాస్టార్‌తో కలిసి గ్రాండ్ సక్సెస్ మీట్!

నారా రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నారా వారి కోడలు..

పవన్ కళ్యాణ్ ‘OG 2’ గురించి అర్జున్ దాస్ షాకింగ్ కామెంట్స్..!

రామ్ చరణ్ ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ అప్పుడేనా?.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

విజయ్‌‌తో బ్రేకప్? బర్త్ డే విషెస్ చెప్పని త్రిష, ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. వీరికి ఏమైంది?

సమంత దంపతులకు చిరంజీవి స్పెషల్ విష్.. ఆ ఒక్క మాటతో గుడ్ న్యూస్ లీక్!

Big Stories

×