Peddi Success: పెద్ది ..భారీ అంచనాల మధ్య జూన్ 4న బరిలోకి దిగిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ‘RRR’ సినిమా తర్వాత మళ్లీ అదే స్థాయి మాస్ జాతరను థియేటర్లలో రిపీట్ చేసిందనే చెప్పాలి.ఇక ప్రస్తుతం వస్తున్న బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, రామ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతంలో వచ్చిన ‘రంగస్థలం’ తరహాలోనే పల్లెటూరి నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ భారీ విజయం ఇచ్చిన జోష్‌తో చిత్ర యూనిట్ నేడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘పెద్ది’ గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానుండటంతో మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్.సాధారణంగా చిరంజీవి తన కొడుకు సినిమాల సక్సెస్ ఈవెంట్స్‌కు వస్తే అక్కడ వచ్చే హైప్ వేరే రేంజ్‌లో ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు
ఇక రామ్ చరణ్ ఈ చిత్రంలో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్‌లో, రా అండ్ రస్టిక్ లుక్‌లో మునుపెన్నడూ లేని విధంగా విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఆయన నటన, ఎమోషనల్ సీన్స్‌లో పలికించిన హావభావాలు, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ తన నటనతో మాయ చేయగా, కన్నడ లెజెండరీ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ వెర్సటైల్ నటుడు దివ్యేందు శర్మ, సీనియర్ యాక్టర్ జగపతి బాబు మరియు బొమన్ ఇరానీలు తమ పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.
also read :బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న ఆ కన్నీటి కథ.. స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన బాలయ్య !
ఈ సినిమాకు మరో ప్రధాన బలమైన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్‌లో రెహమాన్ తన బిజీఎంతో ప్రాణం పోశారని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలను సైతం తలకిందులు చేస్తూ భారీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఈరోజు సాయంత్రం జరగబోయే ఈ విక్టరీ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బుచ్చిబాబు మేకింగ్‌పై, చరణ్ నటనపై ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు? రామ్ చరణ్ తన సక్సెస్ సీక్రెట్స్‌ను అభిమానులతో ఎలా పంచుకోబోతున్నారు? అనే ఉత్కంఠ ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ టోటల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ మీట్‌గా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.