E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Sunil Gavaskar: ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

Sunil Gavaskar:  ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు  ‘ఇండియా క్యాప్’  అస్స‌లు ఇవ్వొద్దు
Advertisement

Sunil Gavaskar:  టీమిండియా క్రికెట్ జట్టులో ( Team India) సమూల మార్పులు ఈ మధ్య జరుగుతున్నాయి. కొత్త ప్లేయర్లు విపరీతంగా జట్టులోకి వస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అజింక్య రహానే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది క్రికెటర్లు జట్టుకు దూరమయ్యారు. దేశవాళీ, ఐపీఎల్ టోర్నమెంట్స్ లో అద్భుతంగా రాణించినప్పటికీ వాళ్లకు అవకాశం తగ్గడం లేదు. ఇక జ‌స్ప్రీత్ బుమ్రా వన్డేలు వాడి దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా అతడికి అవకాశం ఇవ్వడం లేదు. మహమ్మద్ సిరాజ్ కు అవకాశాలు ఇస్తున్నప్పటికీ.. ఏదో ఒక కారణం చూపించి అతన్ని పక్కకు పెట్టేస్తున్నారు.

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

Advertisement

కొత్త బౌలర్లకు అవకాశం ఇచ్చి.. ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలా తరచూ పాత ప్లేయర్లను భర్తీ చేస్తూ, కొత్త ప్లేయర్లను తీసుకువచ్చే విధానంపై మాజీ టీమిండియా స్టార్ ఆటగాడు సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) చాలా సీరియస్ అయ్యారు. ఎవడికి పడితే వాడికి టీమిండియా క్యాప్ ఇవ్వద్దని వార్నింగ్ ఇచ్చారు. గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) హెడ్ కోచ్ అయినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పరోక్షంగా చురకలు అంటించారు. హర్షిత్ రాణాను ( Harshit Rana) ఎందుకు తీసుకుంటున్నారు అర్థం కావడంలేదని సీరియస్ అయ్యారు. దీంతో సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత టీమిండియాలో జరుగుతున్న మార్పులపై సునీల్ గవాస్కర్ చాలా సీరియస్ అయ్యారు. ఎవడికి పడితే వాడికి టీమిండియా క్యాప్ ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి లేదా గాయాలు అయినప్పుడు.. కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకువచ్చి… టీమిండియా క్యాప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడికి పడితే వాడికి ఇచ్చేది ఇది సాధారణమైన క్యాప్ కాదని.. కష్టపడి సంపాదించుకునే అమూల్యమైన రివార్డు అంటూ సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు.

Advertisement

ఇకపైన కొత్త ప్లేయర్లను తీసుకురాకుండా.. పాత ప్లేయర్లకు మళ్ళీ అవకాశాలు ఇవ్వాలని కోరారు. దేశవాళీ అలాగే ఐపీఎల్ లో అద్భుతంగా రానిస్తే జట్టులో స్థానం కల్పించండి అని సూచనలు చేశారు. అంతేకానీ, తనకు దగ్గరి వాళ్ళని అవకాశాలు ఇవ్వకూడదని పరోక్షంగా గంభీర్ కు ( Team India Coach Gautam Gambhir ) వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రతి ఏటా నెలరోజుల పాటు సీనియర్ క్రికెటర్లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐకి సూచనలు చేశారు. దీంతో సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Daryll Cullinan has raised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

Related News

బౌలర్లు భ‌య‌ప‌డుతున్నారు..వైభ‌వ్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఐసీసీ కొత్త రూల్స్ పెట్టాలి

Asghar Afghan: బాబర్ ఆజం కంటే గుర్బాజ్ 1000 రెట్లు బెస్ట్ ప్లేయ‌ర్, మా వాడిది కోహ్లీ రేంజ్

Tanveer Ahmed: వైభ‌వ్ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే, కంబ్యాక్ ఇవ్వ‌డం క‌ష్టం

మ‌రో వివాదంలో అశ్విన్‌…పాకిస్తాన్ ప్లేయ‌ర్ ప‌క్క‌న కూర్చోని ఫోటోలు

శ్రేయ‌స్ అయ్య‌ర్ కు తీవ్ర అన్యాయం..గంభీర్‌, అగార్క‌ర్ క‌లిసి భారీ కుట్ర ?

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆ బుడ్డోడిని ఆడించండి..రోహిత్ తో క‌లిసి చెడుగుడు ఆడుకుంటాడు

దినేష్ కార్తీక్ క‌థ క్లోజ్.. హ‌గ్ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న కోహ్లీ ?

Big Stories

×