E-Paper
Advertisement

Prabhas -Saptagiri: ప్రభాస్ పెద్ద కమెడియన్.. సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!

Prabhas -Saptagiri: ప్రభాస్ పెద్ద కమెడియన్.. సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!
Advertisement

Prabhas -Saptagiri: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ప్రస్తుతం ది రాజా సాబ్(The Raja Saab) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ కైతలపూర్ గ్రౌండ్స్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రభాస్ లుక్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అలాగే ప్రభాస్ ఇచ్చిన స్పీచ్ కు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఇలా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా కమెడియన్ సప్తగిరి (Saptagiri)చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ప్రభాస్ కమెడియన్..

ది రాజా సాబ్ సినిమాలో సప్తగిరి కమెడియన్ గా సందడి చేయనున్నారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ.. సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా తనకు ఈ అవకాశాన్ని కల్పించిన చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక దర్శకుడు మారుతి గురించి మాట్లాడుతూ మంచి మనసున్న మారాజు మారుతి, మకుటం లేని మారాజు ప్రభాస్ అంటూ వారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఇక సినిమాలో ప్రభాస్ పాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో మా అందరి కంటే కూడా ప్రభాస్ పెద్ద కమెడియన్ అంటూ మాట్లాడారు.

కమెడియన్ పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..

Advertisement

ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోని పట్టుకొని సప్తగిరి కమెడియన్ అంటూ మాట్లాడటంతో ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హీరో అలాంటి హీరో గురించి సప్తగిరి కమెడియన్ అంటూ మాట్లాడటంతో అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరు సప్తగిరి ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, సినిమాలో ఆయన పాత్రను ఉద్దేశించి మాట్లాడారు అంటూ సప్తగిరికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శివాజీ వివాదం మర్చిపోకముందే మరోసారి సప్తగిరి ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సంక్రాంతి బరిలో రాజా సాబ్..

Advertisement

ఇలా సోషల్ మీడియా వేదికగా సప్తగిరి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు సప్తగిరి మాత్రం ఈ వ్యాఖ్యలపై ఎక్కడ స్పందించలేదు. ఇక ది రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారు. ప్రభాస్ కు జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Ravi Krishna: కులం చూసి 3 సినిమాల నుంచి పీకేశారు: రవి కృష్ణ

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×