E-Paper
Advertisement

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు టాలీవుడ్ హీరోలతో విభేదాలా? ఇదెక్కడి విడ్డూరం!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు టాలీవుడ్ హీరోలతో విభేదాలా? ఇదెక్కడి విడ్డూరం!
Advertisement

Vijay Deverakonda: దాదాపు 8 సంవత్సరాలుగా రష్మిక మందాన్న (Rashmika mandanna) తో ఉన్న రిలేషన్ గురించి ఎక్కడ బయటపడకుండా.. రహస్యంగా మైంటైన్ చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఎట్టకేలకు ఆమెతో రిలేషన్ గురించి స్పందించారు. అంతేకాదు ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి పీటలెక్కబోతున్నారు. “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అంటూ ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. అటు ఉదయపూర్ లోని ప్యాలెస్ కూడా వీరి పెళ్లికి ముస్తాబవుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లకు చెందిన అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరు అవుతున్నారు.

విజయ్ దేవరకొండ కి ఆ హీరోతో విభేదాలు ఉన్నాయా?

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండకి టాలీవుడ్ లో ఆ హీరోలతో విభేదాలు ఏర్పడ్డాయా? అనే కామెంట్లు ఇప్పుడు బయటపడ్డాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఆయన తన వివాహానికి ప్రత్యేకించి కొంతమందిని ఆహ్వానించగా.. చాలామందిని రిసెప్షన్ కి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా మార్చి 4వ తేదీన హైదరాబాద్లో జరిగే రిసెప్షన్ కి పలువురు సినీ, రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఆ ఇద్దరినీ విజయ్ దేవరకొండ తన పెళ్లికి ఆహ్వానించలేదట. ఈ నేపథ్యంలోనే హీరోకి వారితో విభేదాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి విజయ్ దేవరకొండ తన పెళ్లికి ఎవరెవరిని ఆహ్వానించలేదు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ఆ ఇద్దరినీ పక్కన పెట్టిన విజయ్ దేవరకొండ..

Advertisement

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం.. ప్రకారం మార్చి 4వ తేదీన జరగబోయే రిసెప్షన్ కి ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు, సినిమా హీరోలు, రాజకీయ నాయకులను రిసెప్షన్ కు పిలిచినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫంక్షన్ కి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ రావాలని వాళ్ళందరికీ ఇన్విటేషన్ అందినప్పటికీ.. నాని (Nani)కి అలాగే నిఖిల్(Nikhil )కి మాత్రం విజయ్ దేవరకొండ ఇన్విటేషన్ ఇవ్వలేదట. దీనికి కారణం నాని – విజయ్ దేవరకొండ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని, అందువల్లే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదనే వార్తలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఇక నిఖిల్ కూడా ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ మీద కొన్ని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిఖిల్ ని కూడా విజయ్ దేవరకొండ పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక వీళ్లిద్దరితోపాటు విజయ్ దేవరకొండ ఇంకెవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇన్విటేషన్ అందకపోవడంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ చేస్తోంది.

ALSO READ:Vijay -Rashmika: టాలీవుడ్ రిచెస్ట్ కపుల్స్ జాబితాలో రష్మిక – విజయ్.. మొత్తం ఎన్ని వందల కోట్లంటే?

పట్టింపులకుపోతే నష్టం తప్పదా?

Advertisement

ఇకపోతే ఈ విషయం నెటిజన్లను కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోందనే చెప్పాలి. ఎదుటివాడు ఎంత శత్రువైనా సరే వివాహానికి, పుట్టుకకు, చావుకు కచ్చితంగా ఆహ్వానించాలి.. ముఖ్యంగా ఇండస్ట్రీలో వాళ్ళకి ఇలాంటి పట్టింపులు ఉండకూడదు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి పట్టింపుల జోలికి వెళ్లకుండా తోటి హీరోలు అందరితో బాగుంటేనే ఆయన సినిమా కెరియర్ బాగుంటుంది అని కొంతమంది చెబుతున్నారు. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విజయ్ దేవరకొండ వారిని ఆహ్వానిస్తారేమో చూడాలి.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×