E-Paper
Advertisement

Prabhas: తన చేతికి వచ్చిన సినిమాను స్నేహితుడికి ఇచ్చిన ప్రభాస్… కట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్..!

Prabhas: తన చేతికి వచ్చిన సినిమాను స్నేహితుడికి ఇచ్చిన ప్రభాస్… కట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్..!
Advertisement

Prabhas:  ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతోంది. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాహుబలి, కల్కి లాంటి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానం మరింత బలపరుచుకున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఫౌజీ, స్పిరిట్, సలార్ పార్ట్ 2, కల్కి పార్ట్ 2 వంటి భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రభాస్ ప్రాణ స్నేహితుడు ఎవరంటే..!

Advertisement

ఇదిలా ఉంటే ప్రభాస్‌కు చాలా సన్నిహితుడైన గోపీచంద్ పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. సిటీ మార్ తర్వాత గోపీచంద్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఆరడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా వంటి సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. కొద్ది సంవత్సరాల ముందు విడుదలైన విశ్వం సినిమా మాత్రం యావరేజ్‌గా నిలిచింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ గోపీచంద్ కెరీర్‌ను కొంచెం గాడిలో పెట్టిందని చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం మళ్లీ ఫ్లాప్ అయ్యాయి..

ఇక ప్రభాస్‌కు చెందిన యువి క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ బ్యానర్‌లో తెరకెక్కే సినిమాల్లో ప్రభాస్ నేరుగా నటించకపోయినా.. కథల విషయంలో ఆయన సూచనలు, సలహాలు తప్పక ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. అలా సుమారు పది సంవత్సరాల క్రితం ఒక కొత్త దర్శకుడు ఒక కథతో ప్రభాస్‌ను కలిశాడట. కథ బాగా నచ్చినా, అప్పట్లో బాహుబలి షూటింగ్‌తో బిజీగా ఉండటంతో ప్రభాస్ ఆ దర్శకుడిని వేచి పెట్టడం ఇష్టం లేక..అదే కథను తన స్నేహితుడు గోపీచంద్‌కు చేయమని సూచించాడట.

ఆ సినిమాని గోపీచంద్ కి త్యాగం..!

Advertisement

గోపీచంద్ కూడా కథ విని వెంటనే ఓకే చెప్పాడట. ఆ సినిమా త్వరగా పట్టాలెక్కి, విడుదలై సూపర్ హిట్ అయింది. గోపీచంద్ లుక్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ సినిమా మరేదో కాదు… 2014లో విడుదలైన జిల్. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. తరువాత ఇదే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాధేశ్యామ్ చేశాడు. అయితే ఆ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ALSO READ: Janhvi Kapoor: పెద్ది సినిమాకి సమస్యగా మారిన జాన్వి కపూర్.. ఏమైందంటే..!

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×