E-Paper
Advertisement

MV Agusta Rush Titanio: MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్, డిజైన్ భలే ఉంది గురూ!

MV Agusta Rush Titanio: MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్, డిజైన్ భలే ఉంది గురూ!
Advertisement

MV Agusta Rush Titanio Limited Edition: ఇటాలియన్ టూవీలర్ కంపెనీ MV అగస్టా, బ్రూటేల్ 1000RR ఆధారంగా కొత్త అల్ట్రా ఎక్స్‌ క్లూజివ్, లిమిటెడ్ ఎడిషన్ రష్ టైటానియోను ఆవిష్కరించింది. స్విట్జర్లాండ్‌ సెయింట్ మోరిట్జ్‌ లోని ఇంటర్నేషనల్ కాన్కోర్స్ ఆఫ్ ఎలిగాన్స్‌ లో ఈ మోటార్‌ సైకిల్‌ను లాంచ్  చేసింది. ఈ మోడల్ ను కేవలం 300 యూనిట్లు తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ధర, రిలీజ్ డేట్, పూర్తి స్పెసిఫికేషన్లను త్వరలో వెల్లడించనున్నట్లు కంపెనీ తెలిపింది.

MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకతలు

⦿ డిజైన్, నిర్మాణం: ఈ బైక్‌లో కార్బన్ ఫైబర్ ఎన్‌ క్లోజ్డ్ రియర్ వీల్, టైటానియం ఫ్యూయల్ ట్యాంక్ కవర్,  స్పెషల్ బ్లూ టైటానియో ఆనోడైజ్డ్ అల్యూమినియం పార్ట్స్ ఉన్నాయి. దీనిలో 16 టైటానియం వాల్వ్‌ లు, 4 ఫోర్జ్డ్ టైటానియం కనెక్టింగ్ రాడ్‌లు ఉన్నాయి.

Advertisement

⦿ ఇంజన్ పనితీరు: ఈ సూపర్ బైక్  998cc, ఇన్‌ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ రేస్ కిట్‌తో 13,000 rpm దగ్గర 209 bhp పవర్ ను, 11,000 rpm దగ్గర 86 lb ft టార్క్‌ ను ప్రొడ్యూస్ చేస్తుంది.

⦿ ఫీచర్లు: ఈ బైక్ లో యారో  టైటానియం స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్, కార్నరింగ్ హెడ్‌ లైట్, అడాప్టివ్ టెక్నాలజీ ఉన్నాయి.

Advertisement

⦿ ధర: రేస్ కిట్‌ తో యూరోపియన్ మార్కెట్లో సుమారు £31,890(40.35 లక్షలు), సాధారణ వెర్షన్‌లో £29,290(37.61 లక్షలు) ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: రోల్స్ రాయిస్ కార్లకు ఎందుకు అంత ధర.. అల్టిమేట్ లగ్జరీ వెనుక రహస్యం ఇదే!

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 300 యూనిట్లు

ఇక MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 300 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రతి బైక్‌పై ప్రొడక్షన్ నంబర్‌ తో కూడిన ప్రత్యేక ప్లేట్ ఉంటుంది. ఈ బైక్ అద్భుతమైన వేగం, రేసింగ్ స్టైల్‌ను కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. త్వరలోనే ఈ బైక్ కు సంబంధించిన పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రొడక్షన్ వివరాలను కూడా వెల్లడించనుంది.

Read Also: హ్యుందాయ్ నుంచి దుమ్మురేపే కారు, దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×