Actor Prabhas: ఇటీవల కాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి తదితరులు కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) పెళ్లికి సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ పెళ్లికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
ప్రభాస్ 45 సంవత్సరాలు వయసులో ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు కూడ ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ప్రేమలో పడాలని ఉంది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదట.
ప్రభాస్ రాయలసీమకు అల్లుడుగా రాబోతున్నట్టు సమాచారం. ఈయన కర్నూలు(Kurnool) జిల్లాకు చెందిన ఒక అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ ఆ అమ్మాయి ఎవరు? ఏంటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. పారిశ్రామికవేత్త కుమార్తెనా, లేదంటే రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయా అనే వివరాలు తెలియదు కానీ ఈయన మాత్రం కర్నూలుకు చెందిన అమ్మాయితో ఏడడుగులు నడవబోతున్నారనే వార్త తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా?
మరి ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే గత కొద్దిరోజులుగా అనుష్క శెట్టి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈమె బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ విషయంపై అనుష్క కూడా ఎక్కడ స్పందించలేదు. ఇలా అనుష్క పెళ్లి వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలోనే ప్రభాస్ పెళ్లి వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. గతంలో అనుష్క ప్రభాస్ కలిసి పలు సినిమాలలో నటించిన నేపథ్యంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల పట్ల అనుష్క ప్రభాస్ ఇద్దరు స్పందించి ఖండించారు. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లి రూమర్లకు చెక్ పడింది. తాజాగా ప్రభాస్ పెళ్లి వార్తలు తెర పైకి రావడంతో ఈసారైనా ప్రభాస్ పెళ్లి గురించి వచ్చే ఈ వార్తలు నిజం అయ్యి ఈయన పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రభాస్ ఫౌజీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: Demon Pawan: డెమోన్ పవన్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ.. దేవుడు ఇలా రాసిపెట్టాడంటూ ఎమోషనల్!