E-Paper
Advertisement

Wife and Husband: భర్త ముందు భార్య చేయకూడని 10 పనులు ఇవేనట

Wife and Husband: భర్త ముందు భార్య చేయకూడని 10 పనులు ఇవేనట
Advertisement

Wife and Husband: భర్తల ముందు ఏ భార్యలు కూడా ఈ పది పనులు అసలు చేయకూడదట. అలా చేస్తే ఆ కాపురం మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందట. అయితే ఆ పది పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పక్కింటి మొగుడి గురించి మాట్లాడటం: భార్య ఎప్పుడూ తన భర్త ముందు పక్కింటావిడ భర్త గురించి పొగడటం. ఆయన వాళ్లావిడకు అది తెచ్చారు. ఇది తెచ్చారు అని చెప్పడం. ఆయన ఏం చేసినా గొప్పగా చెప్పడం లాంటివి చేయకూడదట.

Advertisement

అందంగా అలంకరించుకోకపోవడం: భర్త బయటి నుంచి ఎన్నో టెన్షన్స్‌తో ఇంటికి రాగానే భార్య కూడా పాచి ముఖంతో ఎదురు వెళ్లడం. అందంగా కనిపించకపోవడం. ఏదో భార్య కాబట్టి వంట చేయడం లేదంటే అది కూడా చేయనన్నట్టు ఫోజులు ఇవ్వడం లాంటివి చేయకూడదని సూచిస్తున్నారు.

భర్త చెప్పేది వినకపోవడం: భర్త ఏదైనా చెప్తుంటే.. భార్య వినకపోవడం పైగా ఆయన మాటలు పెడచెవిన పెట్టడం. భర్త మాటలను చులకనగా చూడటం. లాంటివి చేయకూడదని సూచిస్తున్నారు.

Advertisement

పుట్టింటి గురించి గొప్పలు చెప్పడం: భార్య అస్తమానం తన పుట్టింటి గురించి గొప్పలు చెప్పడం. ప్రతి దానికి పుట్టింటితో కంపైర్‌ చేసుకోవడం. భర్తను ప్రతి పనిలో చులకనగా మాట్లాడటం. భర్త కన్నా తండ్రి ( తండ్రి గొప్పవాడే కానీ భర్తకు విలువ ఇవ్వకుండా కంపేర్‌ చేయడం కరెక్టు కాదని అర్థం)  గొప్పవాడన్న అభిప్రాయం వ్యక్తం చేయడం.

భర్త కంటే ముందే నిద్రపోవడం: భర్త మెలుకువగా ఉండగానే.. ఆయన కంటే ముందే నిద్రపోవడం. ఇలా చేయడం వల్ల భర్తకు భోజనం ఎవరు వడ్డిస్తారు అనే ప్రశ్న  వస్తుంది. అలాగే భర్త నిద్ర లేచినా కూడా నిద్ర లేవకపోవడం. భర్త ఆఫీసుకు టైం అవుతున్నా టిఫిన్‌ కానీ లంచ్‌ బాక్స్ కానీ రెడీ చేయకుండా నిద్ర పోవడం.

భర్తతో ఆవేశంగా మాట్లాడటం: భర్తతో ఎప్పుడూ భార్య ఆవేశంగా మాట్లాడకూడదట. ఆలా చేస్తే ఆ కాపురాలు కూలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త ఆవేశపడినా భార్య మాత్రం కూల్‌గా సమస్యకు పరిష్కారం ఆలోచించుకోవాలట.

భర్తను ప్రేమగా చూడకపోవడం: ఎవరైనా భార్యలు తమ భర్తలు ప్రేమగా దగ్గరకు తీసుకున్న సందర్భంలో భార్యలు కూడా ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే ఆ కాపురం వందేళ్లు అయినా చాలా స్ట్రాంగ్‌ గా ఉంటుందట. అలా కాకుండా భర్త ప్రేమను అవహేళన చేస్తే మాత్రం ఆ కాపురం మూణ్ణాళ్ల ముచ్చటే అవుతుందట.

భర్త శత్రువును పొగడటం: తన భర్త ముందే ఆయన శత్రువును పొగడటం అనేది ఆడాళ్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదట. భర్తకు శత్రువు అయితే భార్యకు కూడా శత్రువే అన్నట్టుగా బావించాలి. లేదంటే ఆ కాపురం కూలిపోతుందట.

భర్త వస్తువులు నిర్లక్ష్యం చేయడం: భర్త ఏదైనా గిఫ్టు ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు భార్యలు కూడా అంతే ప్రేమగా ఆ గిఫ్టును భద్రపరచాలట. అప్పుడే ఒకరిపై ఒకరిని ప్రేమ, గౌరవం పెరిగి కాపురం చల్లగా ఉంటుందట.

భర్తతో చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోవడం: చాలా మంది భార్యలు ఈ తప్పు ఎక్కువగా చేస్తుంటారు. చిన్న గొడవ పడినా పుట్టింటికి వెళ్లిపోతానని భర్తలను బెదిరిస్తుంటారు. కానీ అలా చేయడం కరెక్టు కాదట. జీవితంలో భార్యాభర్తలే శాశ్వతం కానీ పుట్టినిల్లు మెట్టినిల్లు చుట్టుపు చూపు లాంటివే అంటున్నారు పెద్దలు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పన్నెండు రాశుల వారికి పన్నెండు రెమిడీస్ – వారు పట్టిందల్లా బంగారమేనట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×