E-Paper
Advertisement

KTR: పదవుల్లో ఉండి డ్రగ్స్ వాడటం దురదృష్టకరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR: పదవుల్లో ఉండి డ్రగ్స్ వాడటం దురదృష్టకరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Advertisement

KTR: మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. డ్రగ్స్ ,అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా నేను వ్యతిరేకం అని స్పష్టం చేశారు.మా పార్టీ బీఆర్ఎస్ డ్రగ్స్ వాడకాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపలనైనా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. డ్రగ్స్ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారు (పెడ్లర్లు), వారి రాజకీయలతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించబడాలని డిమాండ్ చేశారు.

Also Read: HYDRAA: రూ. 250 కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమిని కాపాడిన‌ హైడ్రా

బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ కక్ష సాధింపు

Advertisement

ఈ అంశంలో నీచమైన రాజకీయాల కోసం మా బీఆర్ఎస్ పార్టీని లాగుతున్న తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. డ్రగ్స్ కేసును బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం మీ అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు. ‘నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాను అని వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనను నేను స్వాగతిస్తున్నాను.. మనమే ఆదర్శంగా నిలుద్దాం. అని పిలుపు నిచ్చారు. ప్రతి డ్రగ్స్ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులిస్తానని తీవ్రంగా హెచ్చరించారు.

Also ReadRashmika Mandanna: మరిది పుట్టినరోజు..మిస్ అవుతున్నాం అంటూ రష్మిక స్పెషల్ విషెస్!

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×