E-Paper
Advertisement

The Raja Saab Pre release: ఆ హీరోయిన్ కోసం చీర గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్..ఈ యాంగిల్ కూడా ఉందా బాసు?

The Raja Saab Pre release: ఆ హీరోయిన్ కోసం చీర గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్..ఈ యాంగిల్ కూడా ఉందా బాసు?
Advertisement

The Raja Saab Pre release: మారుతి దర్శకత్వంలో ప్రభాస్(Maruthi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్(The Raja Saab) . ఈ సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ తో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయబోతున్నారు.

ప్రతిరోజు పండగే..

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ముగ్గురు వేదికపై ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ ప్రభాస్ తో సినిమా చేయటం తన అదృష్టం అని తెలిపారు. ప్రభాస్ తో ఉంటే ప్రతిరోజు పండగే అంటూ నిధి అగర్వాల్ కామెంట్లు చేశారు. ఇక మాళవిక మోహన్ అని మాట్లాడుతూ.. ఈరోజు కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని తాను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను అలాంటిది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని తెలిపారు.

చీరను కానుకగా ఇచ్చిన ప్రభాస్..

Advertisement

ఇక మరొక హీరోయిన్ రిద్ధి కుమార్ (Riddhi Kumar)సైతం ఈ వేడుకలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ గారి కోసం సినిమా చేయటం చాలా సంతోషంగా ఉందని అలాగే మూడు సంవత్సరాల క్రితం ప్రభాస్ గారు తనకు కానుకగా ఇచ్చిన చీర కట్టుకొని ఈరోజు వచ్చాను అంటూ ఈమె అసలు విషయం తెలియచేశారు.. ఇలా ప్రభాస్ తనకు చీరను కానుకగా ఇచ్చారని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ గట్టిగా కేకలు వేశారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Advertisement

ఇలా హీరోయిన్ కు చీర ఇవ్వడం ఏంటి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ విభిన్న రీతిలో కామెంట్ లు చేస్తున్నారు. సాధారణంగా ప్రభాస్ అందరికీ కడుపునిండా భోజనం పెట్టడం వరకు మాత్రమే మనం విన్నాము కానీ ఇలా కానుకగా చీరలు కూడా ఇస్తారనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొనడమే కాకుండా సినిమా గురించి మాట్లాడుతూ భారీ స్థాయిలో హైప్ పెంచేశారు. కచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని, ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ను చూడబోతున్నారు అంటూ చిత్ర బృందం తెలియచేశారు.

Also Read:  The Raja Saab Pre release: పెళ్లిపై ఓపెన్ అయిన ప్రభాస్.. అందుకే పెళ్లి చేసుకోలేదంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×