E-Paper
Advertisement

The RajaSaab: ఆ సీన్లకు కత్తెర.. రాజాసాబ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే, పిల్లలతో వెళ్లొచ్చా?

The RajaSaab: ఆ సీన్లకు కత్తెర.. రాజాసాబ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే, పిల్లలతో వెళ్లొచ్చా?
Advertisement

The RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తొలిసారి తన సినీ కెరియర్లో హారర్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న చిత్రం ది రాజాసాబ్. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి(Maruthi )దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మాళవిక మోహనన్ , రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ , బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్లు, పోస్టర్లు , గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీనికి తోడు ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు అనే విషయాన్ని కూడా ఇటీవల సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని సినిమాపై అంచనాలు పెంచేశారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న ది రాజాసాబ్..

అయితే ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. హారర్ కామెడీ రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ ఏ (U/A) సర్టిఫికెట్ ను జారీ చేశారు . అంటే ముఖ్యంగా 16 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ సినిమా చూడడానికి అర్హులు అని సెన్సార్ స్పష్టం చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి 189 నిమిషాలతో రన్ టైం లాక్ చేశారు. అంటే 03:09 గంటల నిడివితో థియేటర్లలో జనవరి 9న రాబోతోంది.. సాధారణంగా 2 1/2 గంటలు అంటేనే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష లాంటిది. అలాంటిది మూడు గంటల పాటు ఈ సినిమా నిడివి ఉండబోతుందని తెలిసి అసలు అంతసేపు ప్రేక్షకుడు థియేటర్లో కూర్చుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సెన్సార్ కట్స్.. పిల్లలతో వెళ్ళవచ్చా?

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కథపై అటు సెన్సార్ కట్స్ కూడా ఏమీ లేకపోవడం గమనార్హం. కేవలం నాలుగు సెకండ్ల సీన్ మాత్రమే మార్చివేయాలని సెన్సార్ సభ్యులు సూచించారు. ముఖ్యంగా ఆ నాలుగు సెకండ్ల సీన్ తల నరికే సన్నివేశం కావడంతో దానిని తొలగించమని సెన్సార్ సభ్యులు సూచించారు. అలాగే ఫ్లోర్ పై బ్లడ్ ఎక్కువగా ఉన్న సన్నివేశాన్ని కూడా డిలీట్ చేయమని సూచించారు. ఇకపోతే ఆ భయపడే రెండు సన్నివేశాలను తొలగించారు కాబట్టి మరీ చిన్న పిల్లలను కాకుండా కాస్త ధైర్యంగా ఉండే పిల్లలను ఈ సినిమాకు తీసుకెళ్లవచ్చని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మారుతి ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించారో అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ సినిమా విడుదల అయితే కచ్చితంగా 300 కోట్లు మినిమం గ్యారంటీ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో నిలవబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ALSO READ:Meenakshi Chaudhary: ఎఫైర్ రూమర్స్ పై సుశాంత్ కామెంట్స్.. మీనాక్షి క్లారిటీ! 

సంక్రాంతి బరిలో నెగ్గేదెవరు?

Advertisement

ఇకపోతే ఈ సంక్రాంతి బరిలో ది రాజాసాబ్ సినిమాతో పాటు చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి , నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. ఇక అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలే కావడం గమనార్హం. మరి ఈ సంక్రాంతి బరిలో ఎవరు నెగ్గుతారు అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×