E-Paper
Advertisement

Venkatesh: త్రివిక్రమ్ కి నో చెప్పిన వెంకటేష్… కారణం ఏంటంటే..

Venkatesh: త్రివిక్రమ్ కి నో చెప్పిన వెంకటేష్… కారణం ఏంటంటే..
Advertisement

Trivikram Venkatesh Movie: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అనగానే గుర్తొచ్చేవి ఆయన మార్క్ డైలాగ్స్, ఎమోషన్, కామెడీ. ముఖ్యంగా ఆయన రైటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పంచ్ డైలాగ్స్ చాలా మంది వాడుక భాషలో భాగమైపోయాయి. అయితే రైటర్ గా త్రివిక్రమ్‌కు నిజమైన గుర్తింపు తెచ్చిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ అయింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సన్నివేశాలు, ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. వెంకటేష్ కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయి సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాతో త్రివిక్రమ్ రైటర్‌గా టాప్ లీగ్‌లోకి వెళ్లిపోయారు.

అదే జోష్‌తో త్రివిక్రమ్ డైరెక్టర్‌గా మారి చేసిన మొదటి సినిమా నువ్వే నువ్వే. ఈ సినిమాతో దర్శకుడిగా కూడా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నారు. అక్కడినుంచి ఆయన ప్రయాణం అందరికీ తెలిసిందే. అతడు, జల్సా, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, ఇలా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో త్రివిక్రమ్ తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. అయితే త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో మళ్లీ ఎందుకు రాలేదు అనే ప్రశ్న చాలాకాలంగా ఉంది. దీనిపై తాజాగా వెటరన్ ప్రొడ్యూసర్ శ్రవంతి రవి కిశోర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

Advertisement

నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే సినిమాలను నిర్మించిన ఆయన, ఒక దశలో మళ్లీ వెంకీ త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని అనుకున్నారు. ఆ సమయంలో త్రివిక్రమ్ ఒక కథ చెప్పారని, ఆ కథ వింటే వెంకటేష్‌కి బాగా సూట్ అవుతుందని అనిపించిందని చెప్పారు. కానీ ఆ సమయంలో వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే షూటింగ్‌లో ఉండటం వల్ల, ఆ కొత్త కథ, ఆడవారి మాటలకి సినిమా కథ కొంత ఒకేలా ఉందని భావించి రిజెక్ట్ చేశారట. ఇది దాదాపు పదేళ్ల క్రితం జరిగిన విషయం. అలా ఈ క్రేజీ కాంబో అప్పట్లో మిస్ అయింది.

ఇప్పుడైతే ఆ గ్యాప్ తీరనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. త్రివిక్రమ్ స్టైల్ హ్యూమర్, వెంకటేష్ టైమింగ్ కలిస్తే థియేటర్లలో పండగే అని చెప్పొచ్చు. ఈ సినిమా సమ్మర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దగ్గర పెద్ద ప్రాజెక్ట్స్ లైనప్‌లో ఉన్నాయి. ఆయన రెగ్యులర్ స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉన్నట్టు టాక్. వెంకటేష్ విషయానికి వస్తే చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో వెంకీ ఒక స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతోంది.

ALSO READ: Meenakshi Chaudhary: ఎఫైర్ రూమర్స్ పై సుశాంత్ కామెంట్స్.. మీనాక్షి క్లారిటీ!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×