E-Paper
Advertisement

Sandeep Reddy Vanga :పోలీస్ గెటప్ లో ప్రభాస్, లీక్ పిక్ తోనే హైప్

Sandeep Reddy Vanga :పోలీస్ గెటప్ లో ప్రభాస్, లీక్ పిక్ తోనే హైప్
Advertisement

Sandeep Reddy Vanga : ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమాలలో స్పిరిట్ సినిమా ఒకటి. ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చి సంవత్సరం పైగా దాటింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమం మాత్రం కొద్ది రోజుల క్రితమే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ పూజకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తారీఖున ఈ సినిమా గురించి వచ్చిన అనౌన్స్మెంట్ చాలామందికి హైప్ క్రియేట్ చేసింది. ఆ రోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వచ్చిన అప్డేట్స్ అన్నిటికంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

అనిమల్ సినిమాకి సంబంధించి ఎలా అయితే సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి కూడా సంబంధించి అలానే ప్లాన్ చేశాడు. ప్రభాస్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఒక సిన్సియర్ కాప్ రోల్ ప్రభాస్ చేయబోతున్నారు అని సందీప్ రెడ్డివంగా పలు సందర్భాల్లో ఇంటర్వ్యూస్ లో చెప్పారు.

పోలీస్ గెటప్ లో ప్రభాస్ 

Advertisement

ప్రభాస్ ఎత్తు బరువు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రభాస్ కి సరైన పోలీస్ పాత్ర పడితే ఎలా ఉంటుందో అనేది స్పిరిట్ సినిమా ప్రూవ్ చేయబోతుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మామూలుగానే సందీప్ రెడ్డి సినిమాల్లో హీరోలు విపరీతమైన ఆటిట్యూడ్ తో ఉంటారు. ఇక పోలీస్ క్యారెక్టర్ కాబట్టి అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ రోజుల్లో సినిమాకి సంబంధించి కంటెంట్ దాయడం అనేది సులభమైన పని కాదు. ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసిన కూడా ఆ సినిమాకి సంబంధించి కొన్ని లీక్స్ జరిగిపోతూ ఉంటాయి. స్పిరిట్ సినిమా సెట్స్ నుండి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ఫోటో లీక్ అయింది. ప్రభాస్ పోలీస్ డ్రెస్ లో కనిపించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2026 రిలీజ్ 

Advertisement

సందీప్ రెడ్డి వంగ షూటింగ్ మొదలు పెట్టడానికి టైం తీసుకుంటాడు గాని ఒకసారి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత దాన్ని అతి త్వరగా పూర్తి చేస్తాడు. అనిమల్ సినిమాను కూడా దాదాపు 100 రోజుల్లోనే పూర్తి చేశాడు సందీప్ రెడ్డి. చాలా పెద్ద స్టార్ కాస్ట్ తో ఆ సినిమాని వంద రోజుల్లో తీయడం అనేది మామూలు విషయం కాదు.

అయితే స్వతహాగా సందీప్ రెడ్డి వంగ ఎడిటర్ కూడా కావడంతో ఏ సీన్ ఉపయోగపడుతుంది ఏ సీను ఉపయోగపడదు అనే క్లారిటీ ఉండటం వల్ల సినిమా మేకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. అనవసరమైన సీన్స్ తీస్తూ టైం వేస్ట్ చేయడం.

ఇక సందీప్ రెడ్డి వంగ సినిమాలు డ్యూరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. డ్యూరేషన్ ఎక్కువగా ఉన్నా కూడా అది వర్క్ అనిపించేలా సందీప్ టేకింగ్ ఉంటుంది. ఇప్పటివరకు సందీప్ చేసిన అన్ని సినిమాలు మూడు గంటలు దాటి డ్యూరేషన్ ఉన్నాయి. ఇక స్పిరిట్ సినిమా ఏ డ్యూరేషన్ లో ఉండబోతుందో త్వరలో తెలుస్తుంది.

Also Read: Naga Chaitanya : ఆ ఆర్ట్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నాగచైతన్య , ప్రొడ్యూస్ చేస్తున్న ఆ టాప్ ప్రొడక్షన్ హౌస్

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×