E-Paper
Advertisement

Naga Chaitanya : ఆ ఆర్ట్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నాగచైతన్య , ప్రొడ్యూస్ చేస్తున్న ఆ టాప్ ప్రొడక్షన్ హౌస్

Naga Chaitanya : ఆ ఆర్ట్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నాగచైతన్య , ప్రొడ్యూస్ చేస్తున్న ఆ టాప్ ప్రొడక్షన్ హౌస్
Advertisement

Naga Chaitanya : జోష్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. నాగచైతన్య నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రేంజ్ సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే సినిమా మంచి సక్సెస్ సాధించింది. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేస్తున్నాడు చైతన్య. ఇక ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు మాకు వృషకర్మ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో నాగచైతన్య చేసిన తండేల్ సినిమా మంచి సక్సెస్ సాధించుకుంది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చుట్టు చాలా కాంట్రవర్సీలు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం నాగచైతన్య ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం వినిపిస్తుంది.

ఆ ఆర్ట్ డైరెక్టర్ తో సినిమా

Advertisement

చాలామంది దర్శకులు అవ్వాలనుకుని కూడా వాళ్ళ ప్రయాణాన్ని అక్కడితో మొదలుపెట్టకుండా ఇండస్ట్రీలో ఏదో ఒక పని చేస్తూ ఆ తర్వాత దర్శకుడుగా ట్రైల్స్ వేస్తారు. జూనియర్ ఆర్టిస్టుగా కెరియర్ స్టార్ట్ చేసిన వేణు ఆ తర్వాత కాలంలో చిత్రం శ్రీను అసిస్టెంట్ గా మారాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు.

మొత్తానికి బలగం సినిమాతో అద్భుతమైన సక్సెస్ సాధించి దర్శకుడుగా మంచి పేరు సాధించుకున్నాడు. తండేల్ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇంకా చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. బన్నీ వాసు ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు సమాచారం. వినిపిస్తుంది దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంటుంది.

అంచనాలన్నీ వృషకర్మ మీదే 

Advertisement

వృషకర్మ సినిమాకి సంబంధించి భారీగా ప్లాన్ చేస్తున్నాడు కార్తీక్ దండు. విరూపాక్ష సినిమా విపరీతమైన సక్సెస్ సాధించటంతో, ఆ దర్శకుడు నుంచి వస్తున్న సినిమా కాబట్టి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2026 లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

గతంలో పరశురాం డైరెక్షన్లో నాగచైతన్య సినిమా వస్తుంది అని అందరూ ఊహించరు. సడన్ గా పరుశురాంకు మహేష్ బాబుతో సినిమా అవకాశం రావడం వలన ఈ ప్రాజెక్టు పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఆ తర్వాత కూడా నాగచైతన్య తో సినిమా చేస్తాడు అనుకున్న తరుణంలో అది కూడా జరగలేదు. నా టైం వేస్ట్ చేసాడు అని నాగచైతన్య పలు సందర్భాల్లో చెప్పారు.

Also Read : Sundar C : రజనీకాంత్ ను పక్కనపెట్టి విశాల్ తో సినిమా, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×