E-Paper
Advertisement

OTT Movie : నెట్ ఫ్లిక్స్ ని షేక్ చేస్తున్న ‘స్క్విడ్ గేమ్’ లాంటి బ్లడీ డెత్ గేమ్… ఈ సిరీస్ ను ఇంకా చూడలేదా ?

OTT Movie : నెట్ ఫ్లిక్స్ ని షేక్ చేస్తున్న ‘స్క్విడ్ గేమ్’ లాంటి బ్లడీ డెత్ గేమ్… ఈ సిరీస్ ను ఇంకా చూడలేదా ?
Advertisement

OTT Movie : క‌త్తి ఫైట్లకు సింబల్ గా సమురాయ్ లనే చెప్పుకుంటారు. అప్పట్లో వీళ్ళని యోధులుగా చూసే వాళ్ళు. స‌మురాయ్ లను ఆధారంగా చేసుకుని వచ్చిన యాక్ష‌న్ హిస్టారిక‌ల్ సిరీస్ ‘లాస్ట్ సమురాయ్ స్టాండింగ్’ ఈ నెల పదమూడు నుంచి నెట్ ఫ్లిక్స్ ని షేక్ చేస్తున్న ఈ సిరీస్ ప్రపమంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ జ‌పాన్ సిరీస్ 19వ శ‌తాబ్ధం చివ‌ర‌లో సమురాయ్ లను పూర్తిగా అంతం చేసే ప్లాన్ లో భాగంగా కథ ఉంటుంది. ఒక గేమ్ లో స‌మురాయ్ లను ఒక చోట చేర్చి, డబ్బు ఆశ చూపి డెత్ గేమ్ ఆడిస్తారు ఆ నాటి కొత్త పాలకులు. ఇక ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇది ‘స్క్విడ్ గేమ్’ ని మరపించేలా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం పదండి.

 నెట్ ఫ్లిక్స్ లో

‘లాస్ట్ సమురాయ్ స్టాండింగ్’ (Last Samurai Standing) 2025లో విడుదలైన జపాన్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యాక్షన్ పీరియడ్ డ్రామా సిరీస్. మిచిహిటో ఫుజీ డైరెక్షన్ లో శోగో ఇమామురా నవల ఆధారంగా ఇది తెరకెక్కింది. ఇందులో జూనిచి ఓకాద (షుజిరో సాగా) ప్రధాన పాత్రలో నటించారు. ఇది 2025 నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. 6 ఎపిసోడ్స్ తో ఐయండిబిలో 7.5/10 రేటింగ్ పొందింది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1870 కాలం నాటి జపాన్ లో మెయిజీ యుగం తర్వాత సమురాయ్‌లు అంతరించిపోయారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఆధునిక ఆయుధాలు వచ్చాయి. కత్తులు తిప్పుతూ గౌరవించబడిన సమురాయ్‌లు రోడ్డు మీద పేదల్లా మిగిలారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు దొంగలయ్యారు. అలాంటి టైంలోనే క్యోటోలోని టెన్ర్యూ-జీ టెంపుల్‌ కి సమురాయ్‌ లు రావాల్సిందిగా పిలుపు వస్తుంది. 100 మిలియన్ యెన్ ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పడంతో 292 మంది సమురాయ్‌లు రాత్రికి రాత్రి గుమిగూడతారు. ఫ్యామిలీని కాపాడుకోవడానికి, పెదరికంతో వచ్చిన వాళ్ళే. ఇక్కడ కథలో మెయిన్ హీరో షుజిరో సాగా ఒకప్పుడు గొప్ప సమురాయ్. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న భార్య, ఇద్దరు పిల్లలను కాపాడుకోవడానికి వస్తాడు. ఇక్కడ ఒక రూల్ పెడతారు క్యోటోలోని టెన్ర్యు-జీ ఆలయం నుంచి టోక్యో వ‌ర‌కు వెళ్లి తిరిగి వ‌చ్చిన ఒక‌రికి 100 మిలియన్ యెన్ న‌గ‌దు ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తారు.

Read Also : తాగిన మత్తులో భర్తకి షాకిచ్చే భార్య … ప్రియుడితోనే బాగుందంటూ … మొత్తం అలాంటి సీన్లే

గేమ్ లో భాగంగా అందరి మెడలో ఒక చిన్న వుడెన్ ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్ తీసుకుని టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్‌కి చేరుకోవాలి. ఎవరు చేరుకుంటే వాడే విన్నర్. ఎలా అయినా చంపొచ్చు, మోసం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు. మొదటి రౌండ్‌లోనే 100 మంది చచ్చిపోతారు. అందులో ఫుటాబా అనే యువతిని షుజిరో కాపాడుతాడు. ఆమె కూడా తన తమ్ముడి కోసం గేమ్‌లో ఉంది. ఇద్దరూ టీమ్ అవుతారు. ఇద్దరూ కలిసి రోడ్డు మీద దాడులు చేస్తూ, ట్యాగ్స్ కలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతారు. కానీ గేమ్ వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. గవర్నమెంట్ ఆఫీసర్ ఓకుబో ఈ గేమ్‌ని సీక్రెట్‌గా ప్లాన్ చేశాడు. ఎందుకంటే సమురాయ్‌లు ఇంకా రిబెలియన్ చేయగలరని అతనికి భయం ఉంటుంది. ఈ గేమ్ లో ఒకరినొకరు చంపుకుంటే ప్రాబ్లమ్ ఉండదని ఈ డెత్ గేమ్ సెట్ చేశాడు. చివరికి టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్ దగ్గరికి ఎవరు చేరుకుంటారు ? ప్రైజ్ మనీ ఎవరికి వస్తుంది ? ఓకుబో ప్లాన్ సక్సెస్ అవుతుందా ? అనే విషయాలను, ఈ సిరీస్ ని చూసి తెలుకోవాల్సిందే.
Advertisement

 

 

 

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×