E-Paper
Advertisement

Prabhas : స్పిరిట్ సెట్స్ నుంచి ప్రభాస్ ఫోటో లీక్, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది సరిపోతుందేమో?

Prabhas : స్పిరిట్ సెట్స్ నుంచి ప్రభాస్ ఫోటో లీక్, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది సరిపోతుందేమో?
Advertisement

Prabhas : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పవన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. బాహుబలి అనే సినిమా కోసం ఐదు సంవత్సరాలు కేటాయించి ఒక డేర్ స్టెప్ వేశాడు. ఆ డేరింగ్ అనేది ప్రభాస్ కు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ ఒక సినిమా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఆ సినిమా కోసం ఎదురు చూస్తారు.

బాహుబలి సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఊహించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అంతేకాకుండా ఆ మూడు సినిమాల విషయంలో కూడా విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ప్రభాస్ అందం అంతా ఏమైపోయింది అని అందరూ అనుకున్నారు.

స్పిరిట్ సెట్స్ నుంచి ప్రభాస్ ఫోటో లీక్ 

Advertisement

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో తోనే మంచి హైట్ క్రియేట్ చేశాడు సందీప్.

ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగ కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని స్పిరిట్ సెట్స్ నుంచి లీకైన ఫోటోగా చెబుతున్నారు.

Advertisement

ప్రభాస్ మాత్రం ఫోటోలో చాలా అందంగా కనిపిస్తున్నాడు. బ్లాక్ కలర్ హుడి వేసుకుని, వైట్ పాంట్ లో జోబు లో చేతులు పెట్టుకొని స్టైలిష్ గా క్యాప్ పెట్టుకుని నిలుచున్నాడు. ఎదురుగా సందీప్ రెడ్డి వంగ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వెనుక సినిమాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ సెట్ కూడా కనిపిస్తుంది.

ఫుల్ జోష్ లో ప్రభాస్ ఫ్యాన్స్ 

ప్రస్తుతం ఈ ఫోటో చూసిన చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆనందంతో కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ హై సరిపోతుంది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మారుతి ప్రభాస్ ను ఈ మధ్యకాలంలో అందంగా చూపించాడు. ఇప్పుడు దానినే కంటిన్యూ చేస్తున్నట్లు ఉన్నాడు సందీప్.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్ర చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాత్రం ఫిట్నెస్ ఉండడం అనేది అవసరం. బహుశా అదే ఉద్దేశంతో ఈ సినిమా కోసం మంచి స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా 2026లో విడుదలవుతుంది.

Also Read : Spirit : మెగాస్టార్ తో సందీప్ రెడ్డి డైరెక్షన్ టీం, ఆ దర్శకుడు మళ్లీ చేరాడా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×