E-Paper
Advertisement

Prabhas: కపుల్ ఫ్రెండ్లీపై ప్రభాస్ ప్రశంసలు.. ఆ సూపర్ హిట్ సినిమాతో పోల్చిన డార్లింగ్

Prabhas: కపుల్ ఫ్రెండ్లీపై ప్రభాస్ ప్రశంసలు.. ఆ సూపర్ హిట్ సినిమాతో పోల్చిన డార్లింగ్
Advertisement

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కెరియర్ పరంగా ఎన్నో అద్భుతమైన సినిమాలకు కమిట్ అయి వరుస సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉండే ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు కానీ ఈయన సోషల్ మీడియా వేదికగా ఇతర సినిమాలపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు చేయడం ఇతర సినిమాలకు మద్దతు ప్రకటించడం చేస్తూ ఉంటారు. ప్రభాస్ కు ఏదైనా సినిమా నచ్చింది అంటే వెంటనే చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తూ ఈయన పోస్టులు పెడుతుంటారు. తాజాగా ప్రభాస్ సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ (Couple friendly) సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

కపుల్ ఫ్రెండ్లీ పై ప్రభాస్ రివ్యూ..

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి స్పందిస్తూ. చాలా అందమైన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమాని చూడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సంతోష్, మానస వారణాసి చాలా అద్భుతంగా చేశారని, ఇలాంటి కథలను వెండితెరపైకి తీసుకువచ్చినందుకు అశ్విన్, అజయ్ అలాగే యు వి క్రియేషన్స్, చిత్ర బృందం మొత్తానికి అభినందనలు అంటూ తెలియచేశారు.

లవ్ అండ్ రొమాంటిక్ సినిమా..

Advertisement

ఇక ఈ సినిమా నాకు వర్షం సినిమా భావన కలిగించిందని నా ప్రియమైన సంతోష్ శోభన్ కోసం ఇది కపుల్ ఫ్రెండ్లీ అవుతుంది అంటూ ఈ సినిమా పట్ల ప్రభాస్ ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ప్రభాస్ రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమా పట్ల మరింత బజ్ ఏర్పడిందని చెప్పాలి. ఇక ఈ సినిమా ఎమోషనల్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పర్ఫెక్ట్ వాలెంటైన్స్ డే సినిమా అనే చెప్పాలి. ఇలా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంటుంది.

కపుల్ ఫ్రెండ్లీతో హిట్ కొట్టిన సంతోష్..

Advertisement

ఇక సంతోష్ శోభన్ ఇటీవల కాలంలో పలు సినిమాలలో నటించిన ఈయనకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చిన సంతోష్ తాజాగా కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరి ఎలాంటి అవకాశాలు వస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మానస చౌదరి తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో రాజీవ్ కనకాల, యోగి బాబు, గోపరాజు రమణ,లివింగ్‌స్టన్ వంటి తదితరులు నటించారు.

Also Read: Adhurs 2: అదుర్స్ 2 పై కోన వెంకట్ క్రేజీ అప్డేట్.. చారీ మళ్ళీ రాబోతున్నాడా?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×