E-Paper
Advertisement

Viral Video: పెళ్లి వేదికపైకి.. స్టైల్‌గా వచ్చి సైలెంట్‌గా.. వధువు బ్యాగ్ కొట్టేసిన దొంగ

Viral Video: పెళ్లి వేదికపైకి.. స్టైల్‌గా వచ్చి సైలెంట్‌గా.. వధువు బ్యాగ్ కొట్టేసిన దొంగ
Advertisement

Viral Video: సాధారణంగా దొంగలు చీకటిలో చోరీలకు పాల్పడుతుంటారు. పబ్లిక్ ప్లేసులు, ఫంక్షన్ల జోలికి అసలు పోరని చెబుతుంటారు. అలాంటిది ఓ దొంగ వివాహ వేడుకకు హాజరై.. దర్జాగా చోరీకి పాల్పడ్డాడు. వధూవరులు బంధువులతో కలిసి ఫొటోలు దిగుతుండగా.. ఎంతో చాకచక్యంగా తన పని తాను చేసుకొని వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..

Advertisement

రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 7న జగత్ పురాలోని చందన్ వాన్ ప్రాంతంలో ఓ వివాహం జరిగింది. మంచి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి.. అతిథులతో పాటు పెళ్లి వేడుకలో హడావిడీ చేస్తూ కనిపించాడు. అనంతరం వధూవరులు ఉన్న వేదికపైకి అతిథులతో పాటు కలికి వెళ్లాడు.

సైలెంట్‌గా దోచేసి..

Advertisement

నూతన వధూవరులు తమ బంధువులతో ఫొటోలు దిగుతుండగా.. నిందితుడు తన చేతివాటం ప్రదర్శించాడు. పక్కనే ఉన్న వధువు హ్యాండ్ బ్యాగ్ ను సైలెంట్ గా తీసుకున్నాడు. అనంతరం దానిని చేతిలోని బ్లేజర్ లో కనిపించడా దాచేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also Read: Single vs Double Door Fridges: డోర్లలోనే కాదు.. ఫీచర్లలోనూ వ్యత్యాసం.. రెండింటిలో ఏది కొంటే బెటర్

రూ.4 లక్షలు మాయం..

కొద్దిసేపటి తర్వాత వధువు తన బ్యాగ్ కోసం చూడగా కనిపించలేదు. అందులో రూ.4 లక్షల నగదు ఉండటంతో వధూవరులతో పాటు బంధువులు కంగారు పడ్డారు. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి పెళ్లి వీడియోలను పరిశీలించారు. దీంతో దొంగతనం దృశ్యాలు బయటపడ్డాయి. ప్రొఫెషనల్ దొంగల ముఠా ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హై ప్రొఫెల్ పెళ్లిళ్లను టార్గెట్ చేస్తూ ఇలా వరుసగా చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read: Xiaomi X Pro QLED Smart TV: కొత్త స్మార్ట్ టీవీ కావాలా? అయితే గెట్ రెడీ.. సూపర్ డూపర్ మోడల్ వచ్చేస్తోంది!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×