E-Paper
Advertisement

Prabhas: నీ గొంతు నా మనసును తాకింది.. హీరోయిన్ పై ప్రభాస్ ప్రశంసలు..

Prabhas: నీ గొంతు నా మనసును తాకింది.. హీరోయిన్ పై ప్రభాస్ ప్రశంసలు..
Advertisement

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్న ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు కేవలం ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అలాగే ఏదైనా సినిమాలు విడుదలయితే ఆ సినిమాల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇంతకుమించి ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరనే చెప్పాలి. ఇక హీరోయిన్ల విషయంలో ప్రభాస్ ఆమడ దూరంలో ఉంటారనే విషయం తెలిసిందే. ఈయన పెద్దగా ఎవరితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు అలాంటి ప్రభాస్ ఒక హీరోయిన్ పై ప్రశంసలు కురిపించారంటే మామూలు విషయం కాదు. మరి ప్రభాస్ ఏ హీరోయిన్ పై ప్రశంసలు కురిపించారనే విషయానికి వస్తే..

రాషా తడాని పై ప్రభాస్ ప్రశంసలు..

ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బాలీవుడ్ నటి రాషా తడాని పట్ల ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్, అనిల్ తడాని వారసురాలిగా రాషా (rasha tandon)ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె బాలీవుడ్ చిత్రం లైకీ లైకా(Laikey Laikaa) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు అయితే ఈ సినిమాలో “చాప్ తిలక్” అనే పాటను ఆలపించారు. ఈ పాట ద్వారా
రాషా సింగర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఫిదా అయ్యారు.

సింగింగ్ డెబ్యూ చాలా అద్భుతంగా ఉంది..

Advertisement

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రాషా ఫోటోలను షేర్ చేస్తూ..” రాషా నీ సింగింగ్ డెబ్యూ చాలా అద్భుతంగా ఉంది. నీ గొంతు నేరుగా నా మనసును తాకింది: అంటూ ఈమె పాడిన పాటపై ప్రభాస్ ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా ప్రభాస్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎవరితోనైనా మాట్లాడటానికి ఇబ్బంది పడే ప్రభాస్ ఇలా హీరోయిన్ గురించి ఆమె పై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేయడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

శ్రీనివాస మంగాపురం..

Advertisement

ఇక రాషా తడాని విషయానికి వస్తే ఈమె కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఘట్టమనేని వారసుడుగా జయకృష్ణ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్న శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram) అనే సినిమా ద్వారా హీరోయిన్ గా రాషా తడాని తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Mamta Kulkarni: అమీర్ ఖాన్ మా ఇంటికి వచ్చి, కిచెన్‌లో.. మమతా కులకర్ణి కామెంట్స్ వైరల్

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×