E-Paper
Advertisement

Prabhas: పక్కరాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రభాస్.. ఫుడ్ అంటే అంత ఇష్టం ఏంటయ్యా బాబు!

Prabhas: పక్కరాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రభాస్.. ఫుడ్ అంటే అంత ఇష్టం ఏంటయ్యా బాబు!
Advertisement

Prabhas: ప్రభాస్ పరిచయం అవసరం లేని పేరు పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన కెరియర్ విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రభాస్ చాలావరకు వివాదాలకు దూరంగా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే అభిమానులతో పంచుకుంటారు. ఇక ప్రభాస్ ఫుడ్ లవర్ అనే సంగతి అందరికీ తెలిసిందే ఈయన చాలా ఇష్టంగా తనకు నచ్చిన అన్ని ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకొని మరి తింటారు. తను తినడమే కాకుండా తన పక్కన ఉన్నవారికి కూడా అదే ఫుడ్ పెట్టడం ప్రభాస్ నైజం. ఇలా అతిథి మర్యాదల విషయంలో ప్రభాస్ తరువాతే ఎవరైనా అని చెప్పాలి. శత్రువైన ఇంటికి వస్తే కడుపునిండా భోజనం పెట్టి పంపించే తత్వం ప్రభాస్ ది.

పక్క రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్..

ఇలా ప్రభాస్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు చిత్ర బృందానికి వారికి ఎంతో ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తెప్పిస్తుంటారు. అలాగే ఎంతో మంది సెలబ్రిటీలకు సర్ప్రైజ్ ఇస్తూ వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ పంపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రభాస్ పంపించిన ఫుడ్ కు సంబంధించిన ఫోటోలను సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా ప్రభాస్ కపుల్ ఫ్రెండ్లీ చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సంతోష్ శోభన్ ప్రభాస్ ను ప్రశ్నిస్తూ.. అన్న మీరు ఫుడ్ పక్క రాష్ట్రాల నుంచి కూడా తెప్పించుకుంటారంట కదా అని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ప్రభాస సమాధానం చెబుతూ అందరూ నా ఫుడ్ మీద పడతారేంటయ్య బాబు.. నువ్వు రాజమౌళి అందరూ కూడా నా ఫుడ్ గురించే మాట్లాడుతుంటారు అని ప్రభాస్ తెలిపారు.

చెన్నై నుంచి ముంబైకి ఫుడ్ ఆర్డర్..

Advertisement

ఆది పురుష్ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ ఓం రౌత్ తో మాట్లాడుతూ.. ఈరోజు నీకు ఏ స్పెషల్ కావాలన్నా తెప్పిస్తాను అంటూ చెప్పాను. అయితే ఆయన చెన్నై స్పెషల్స్ కావాలని కోరారు ఇక నేను వెంటనే చెన్నై నుంచి ఆ ఫుడ్ తెప్పించే ప్రయత్నం చేశాను రాత్రి 10 అవుతుంది ఇంకా ఫుడ్ రాలేదు. దీంతో ఓం రౌత్ ఇంకా ఎంతసేపు ఫుడ్ అంటూ అడిగారు చెన్నై నుంచి ఫుడ్ రావాలంటే కాస్త లేట్ అవుతుంది కదా నువ్వేమీ తినకు అంటూ చెప్పాను దీంతో ఒక్కసారిగా ఓం రౌత్ చెన్నై నుంచి ఫుడ్ రావడం ఏంటి అంటూ ఆశ్చర్యపోయాడు అవును అక్కడొకడు ఫుడ్ తయారు చేసుకొని స్పెషల్ గా ఫ్లైట్లో ముంబై తీసుకొస్తున్నారని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు నేను ఇలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. అసలు పక్క రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోయారని అప్పటి విషయాన్ని ప్రభాస్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఒకరికి ఫుడ్ పెట్టడం గొప్ప విషయం..

Advertisement

సాధారణంగా ఒకరికి కడుపునిండా అన్నం పెట్టడం గొప్ప విషయం అలాంటిది వారికి నచ్చిన ఫుడ్ ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి పెట్టడం అంటే మామూలు విషయం కాదు అలా పెట్టాలి అంటే చాలా పెద్ద మనసు ఉండాలని, అలాంటి మంచి మనసు ప్రభాస్ కు మాత్రమే సొంతం అంటూ ప్రభాస్ అభిమానులు ఈ విషయం తెలిసి కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఫుడ్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకొని తినే అంత ఇష్టం ఏంటి బాసు అంటూ కూడా ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: Prabhas: విజయవాడ వస్తే వాటిని తినాల్సిందే..ప్రభాస్ కు ఇష్టమైన స్నాక్స్ అవేనా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×