E-Paper
Advertisement

Prabhas Herione: ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్ ప్రియురాలి చెల్లి… ఇన్‌‌స్టాలో రొమాంటిక్ ఫోటోలు వైరల్

Prabhas Herione: ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్ ప్రియురాలి చెల్లి… ఇన్‌‌స్టాలో రొమాంటిక్ ఫోటోలు వైరల్
Advertisement

Prabhas Herione : బాలీవుడ్‌లో.. సెలబ్రిటీల ప్రేమ కథలు చాలానే వినిపిస్తుంటాయి. కానీ కొన్నిసార్లు అవి చాలా అందంగా..సినిమాటిక్ గా కూడా అనిపిస్తాయి
.. అలాంటి ఒక అందమైన ప్రేమ కథ ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రభాస్ తో ఆది పురుష సినిమాలో నటించిన నటి కృతి సనన్..సోదరి నుపూర్ సనన్ తన పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ప్రముఖ గాయకుడు స్టెబిన్ బెన్ ను కావటం విశేషం. కృతి సనన్ గతంలో ప్రభాస్ తో ప్రేమలో ఉంది అన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా తమ కేవలం స్నేహితులము అంటూ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు అక్క కన్నా ముందు చెల్లెలి పెళ్లి ఫిక్స్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

కొన్ని రోజులుగా నుపూర్.. స్టెబిన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నుపూర్ స్వయంగా ఆ వార్తలకు ముగింపు పలికింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ..తాను పెళ్లికి సిద్ధమవుతున్నానని చెప్పింది. ఆ ఫొటోలు చూసిన వారందరు వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

?utm_source=ig_web_copy_link

ఈ ప్రపోజల్ చాలా స్పెషల్‌గా జరగటం విశేషంగా మారింది. ఓ అందమైన యాచ్‌పై.. నీలాకాశం కింద స్టెబిన్ బెన్ మోకాళ్లపై కూర్చొని నుపూర్‌కు ప్రపోజ్ చేశాడు. వెనుక “Will you marry me?” అని రాసిన బ్యానర్లు..డ్యాన్సర్లు కనిపించారు. ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారింది అని..నుపూర్ పోస్ట్ ద్వారా తెలిపింది. ఇక ఈ ప్రపోజల్ ఫోటోలో..ఆమె చేతిలో ఉన్న భారీ డైమండ్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

అంతేకాకుండా..ఆ ఫొటోలలో నుపూర్ చాలా ఆనందంగా కనిపించింది. మరో ఫొటోలో స్టెబిన్ చేతిని పట్టుకుని చిరునవ్వుతో నిల్చుంది. ఇంకొక ఫొటోలో అక్క కృతి సనన్.. కూడా వచ్చి ఇద్దరినీ హగ్ చేసుకుంది. నుపూర్ తన పోస్ట్‌లో “ఎన్నో సందేహాల మధ్య నాకు దొరికిన ఈ ఎస్.. చాలా ఈజీగా చెప్పాను” అంటూ భావోద్వేగంగా రాసింది.

ఈ నేపథ్యంలో..వీరి పెళ్లి ఈ నెలలోనే జరగనుందని సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నట్లు టాక్. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే ఈ పెళ్లి జరుగుతుందట. ఇప్పటికే అభిమానులు, సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

నుపూర్ సనన్ తెలుగులో టైగర్ నాగేశ్వర్ రావ్.. సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో టైటిల్ పాత్రలో రవి తేజ నటించగా..నుపూర్ పాత్ర కథకు.. బలమైన ఎమోషనల్ టచ్ ఇచ్చింది. గ్లామర్‌కు పరిమితం కాకుండా మంచి పాత్రలో నటించడం ఆమెకు ప్లస్ అయ్యింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో…ఆమెకి మళ్ళీ తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు.

ALSO READ: Prabhas: స్టార్ హీరోలకు భిన్నంగా ప్రభాస్ వెళ్లడానికి కారణం ఏమిటో తెలుసా..?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×