Dustbin Vastu Tips: సనాతన సంప్రదాయంలో..ఇంట్లో ఆనందం, శాంతి, సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తిని కాపాడుకోవడానికి వాస్తు నియమాలను పాటించడం అవసరమని నమ్ముతారు. ఇల్లు నిర్మించేటప్పుడు ఎవ్వరైనా సాధారణంగా గదులు, కిచెన్, పూజా గది వంటి వాట దిశపై శ్రద్ధ చూపుతారు, కానీ తరచుగా రోజూ ఉపయోగించే చిన్న వస్తువులను పట్టించుకోరు. వీటిలో ఒకటి చెత్తబుట్ట. వాస్తు శాస్త్రం ప్రకారం, చెత్త డబ్బాను తప్పుడు దిశలో ఉంచడం వల్ల ఇది ఇంటి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా మీ మానసిక ప్రశాంతతపై కూడా ప్రభావం చూపుతుంది. చెత్త డబ్బా వాస్తుకు మధ్య గల సంబంధాన్ని.. దానిన ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెత్తబుట్ట, వాస్తు శాస్త్రం మధ్య సంబంధం:
వాస్తు శాస్త్రంలో.. చెత్తబుట్టను ప్రతికూల శక్తికి మూలంగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనిని ఇంట్లోని చెత్త, పనికిరాని వస్తువులను వేయడానికి చేయడానికి ఉపయోగిస్తారు. దానిని సరైన స్థలంలో ఉంచకపోతే అది క్రమంగా మొత్తం ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. మత విశ్వాసాల ప్రకారం.. తప్పుడు దిశలో చెత్తబుట్ట ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలకు ఆటంకం కలిగిస్తుంది. దీని ఫలితంగా ఇంటికి డబ్బు రావడం తగ్గుతుంది. అంతే కాకుండా అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
ఈశాన్య దిశలో చెత్తబుట్టను ఉంచడం వల్ల కలిగే నష్టాలు:
వాస్తు ప్రకారం ఈశాన్య దిశను అత్యంత పవిత్రమైనది. అంతే కాకుండా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ దిశ జ్ఞానం, శాంతి, సానుకూలమైన శక్తితో ముడిపడి ఉంటుంది.ఈ దిశలో చెత్త డబ్బాను ఉంచడం వల్ల మానసిక అశాంతి పెరుగుతుంది. ఇంట్లోని సభ్యులు అనవసరంగా ఒత్తిడికి, చిరాకుకు గురవుతారు. ముఖ్యంగా..ఇంటి యజమానికి నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు బలహీనంగా మారతాయి.
ఆగ్నేయ దిశలో చెత్తబుట్టను ఎందుకు అశుభంగా భావిస్తారు ?
ఆగ్నేయ దిశ అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది. అంతే కాకుండా ఇది డబ్బు, శక్తి, వ్యయంతో ముడిపడి ఉంటుంది.చెత్తబుట్టను ఈ దిశలో ఉంచడం వల్ల ఆదాయం నిలవదు. అంతే కాకుండా ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. క్రమంగా, ఆర్థిక ఒత్తిడి, అప్పులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఇంటి యజమాని ఆర్థిక స్థిరత్వంపై కూడా ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
Also Read: మంగళ, శుక్రవారాల్లో అప్పు ఇస్తే తిరిగి రాదా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
చెత్తబుట్టను ఉత్తరం తూర్పు దిశలలో ఉంచడం వల్ల కలిగే ప్రభావాలు:
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తరం, తూర్పు దిశలు పురోగతి, వృత్తి , అభివృద్ధికి సంబంధించినవి.ఈ దిశలలో చెత్తబుట్టను ఉంచడం అశుభకరమని భావిస్తారు. ఇంట్లో ప్రతికూలత, విచారకరమైన వాతావరణం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.చెత్తబుట్టను ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఉద్యోగం , కెరీర్ అవకాశాలు ప్రభావితం అవుతాయి. ఇంటి పురోగతిలో అడ్డంకులు, ప్రణాళికలలో వైఫల్యం కలుగుతుంది. కాబట్టి.. ఈ దిశలను శుభ్రంగా, తెరిచి ఉంచడం ఎల్లప్పుడూ మంచిది.
చెత్తబుట్టను ఉంచడానికి ఏ దిశ మంచిది ?
వాస్తు శాస్త్రం ప్రకారం.. చెత్త బుట్టను కప్పి ఉంచి, దక్షిణం లేదా పశ్చిమ దిశలో క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ఉత్తమం. ఇది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావాన్ని తగ్గిస్తుంది.
చెత్తబుట్ట చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ వాస్తు శాస్త్రంలో దాని అమరిక చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. చెత్తబుట్టను తప్పు దిశలో ఉంచడం వల్ల ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి, కుటుంబ అసమతుల్యత ఏర్పడుతుంది. సరైన దిశ, పరిశుభ్రత పాటిస్తే.. ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది.