Prabhas: ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం చూసినా.. అత్యంత బిజీ హీరో ఎవరు అంటే చాలా మంది..వెంటనే చెప్పే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా స్టార్ హీరోల లిస్టులో ముందంజలోనే ఉంటారు మన డార్లింగ్. సాధారణంగా తెలుగు స్టార్ హీరోలు రెండు లేదా మూడు సంవత్సరాలకు..ఒక సినిమా మాత్రమే విడుదల చేస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేశారు. ఒకే ఏడాదిలో రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ.. అభిమానులను ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో పలకరిస్తున్నారు. ఇదే ఆయనను మిగతా హీరోల కంటే భిన్నంగా నిలబెడుతోంది.
ఇప్పటికే ప్రభాస్ సలార్..కల్కి 2898 ఏడి వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలు దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో విడుదలై..ప్రభాస్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ కొత్త ఏడాది ఆయన ది రాజా సాబ్..సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2026 సంక్రాంతికి.. మారుతి దర్శకత్వంలో వస్తున్న..ఈ ది రాజా సాబ్ విడుదలకు సిద్ధమవుతోంది.
ఇవే కాకుండా ఒకవైపు సందీప్ రెడ్డి దర్శకత్వంలో రానున్న.. స్పిరిట్ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మరోవైపు సీత రామమ్ దర్శకుడు హను రాఘవపూడి రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ.. ప్రాజెక్ట్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య.. ఫిబ్రవరిలోనే మళ్లీ కల్కి 2898AD సినిమా తదుపరి భాగం షూటింగ్ మొదలుపెట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకేసారి ఇన్ని సినిమాల్లో పాల్గొనడం చాలా కష్టం. అయినా ప్రభాస్ మాత్రం తన ఆరోగ్యం.. సమయం అన్నింటినీ ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో “ప్రభాస్ ఇలా ఎందుకు భిన్నంగా పనిచేస్తున్నారు?” అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. దీనిపై తాజాగా దర్శకుడు మారుతి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “ఇప్పటి నటులు చాలా మంది ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా మొదలుపెడుతున్నారు. కానీ ప్రభాస్ గారు మాత్రం అలా కాదు. ఆయనకు కష్టపడటం అంటే నిజంగా ఇష్టం. ఆయన ఎంతగా శ్రమిస్తారో.. చూసి మేమే కొన్నిసార్లు టెన్షన్ పడతాం” అని చెప్పారు.
అంతేకాదు..ప్రభాస్ రోజంతా సినిమా గురించే..అభిమానుల గురించే ఆలోచిస్తారని మారుతి తెలిపారు. అభిమానులు నిరాశ చెందకూడదనే భావనతోనే ఆయన ఎక్కువ సినిమాలు చేస్తున్నారని అన్నారు. తన పని పట్ల ఉన్న అంకితభావం, సినిమాపై ఉన్న ప్రేమే ప్రభాస్‌ను మిగతా స్టార్ హీరోలకంటే పూర్తిగా భిన్నంగా నిలబెడుతోంది అని మారుతీ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలు విని.. ప్రభాస్ అభిమానులు..అందుకే ఒకేసారి ఎన్నో సినిమాలు చేస్తూనే.. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రభాస్ పూర్తి న్యాయం చేయగలుగుతున్నారు అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .
ALSO READ: Thalapathy Vijay vs Prabhas: అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర పై చేయి ఏ హీరోది..!