E-Paper
Advertisement

Prabhas రోజూ.. కేవలం దాని కోసమే రూ.2 లక్షలు ఖర్చు పెడతాడట!

Prabhas రోజూ.. కేవలం దాని కోసమే రూ.2 లక్షలు ఖర్చు పెడతాడట!
Advertisement

Prabhas Personal Life: ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా సంక్రాంతికి..జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్, సినిమా టీమ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సినిమా అప్‌డేట్స్‌తో పాటు ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో ముఖ్యంగా ప్రభాస్ భోజనంపై జరుగుతున్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌కు భోజనం అంటే చాలా ఇష్టం. కానీ ఆయన ఒక్కడే తినే వ్యక్తి కాదు. షూటింగ్ సెట్‌లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చుట్టూ ఉన్నవాళ్లతో కలిసి భోజనం చేయడమే ఆయన అలవాటు. సెట్‌లో కనీసం 10 నుంచి 20 మంది ఉన్నా అందరితో కలిసి కూర్చొని తింటాడు.

Advertisement

కొన్నిసార్లు అయితే షూటింగ్ జరుగుతున్న సెట్లో.. ఉన్నవాళ్లందరికీ ప్రభాస్ ఇంటి నుంచి భోజనాలు పంపిస్తాడని చాలామంది సెలబ్రిటీలు ఓపెన్‌గా చెప్పారు. ఆ భోజనం ఒకటి రెండు వంటకాలు కాదు. పేర్లు చెప్పాలంటేనే చాలా సమయం పడేలా ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటాయి. అందుకే ప్రభాస్ భోజనం అంటే ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.

ఈ కారణంగానే ప్రభాస్ కోసం ఒక స్పెషల్ కుకింగ్ టీమ్ ఉందని ఇండస్ట్రీలో టాక్. ఆ టీమ్ ఒక్కరోజు చేసే వంట ఖర్చు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు. ప్రభాస్‌కు మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు లాంటి నాన్ వెజ్ వంటకాలు చాలా ఇష్టం. వీటితో పాటు వివిధ రకాల కాంబినేషన్స్ రోజూ సిద్ధం చేస్తారట.

Advertisement

ప్రభాస్ మనస్తత్వం తెలిసినవాళ్లంతా ఒక మాట చెబుతారు. ఖర్చు ఎంతైనా సరే, తన వాళ్లు తృప్తిగా తింటే చాలని ఆయన భావన. అందుకే ప్రభాస్ భోజన ఖర్చు తగ్గే అవకాశం ఉండదని, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ మాత్రం ఉందని ఇండస్ట్రీలో అంటున్నారు.
ఇలాంటి సింపుల్ మనసే ప్రభాస్‌ను నిజమైన డార్లింగ్‌గా మార్చిందని అభిమానులు అంటున్నారు.

ALSO READ: Prabhas Phone Number: రిధి కుమార్ ఫోన్లో ప్రభాస్ పేరు ఏమని సేవ్ చేసిందో తెలుసా..?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×