E-Paper
Advertisement

Gambling: పేకాట కోసం ఏకంగా న్యాయస్థానానికి.. ఏపీ హైకోర్టు భలే షాకిచ్చింది

Gambling: పేకాట కోసం ఏకంగా న్యాయస్థానానికి.. ఏపీ హైకోర్టు భలే షాకిచ్చింది
Advertisement

పేకాట అంటే ఒక జూదం. సరదాగా ఆడుకుంటే పర్వాలేదు. కానీ, పందాలు కడితేనే అసలైన సమస్య. డబ్బులు పెట్టకుండా పేకాడితే కిక్కేం ఉంటుంది అనేది పేకాట క్రీడాకారుల అభిప్రాయం. వీళ్లను ఇలా వదిలేస్తే.. పేకాటను కూడా ఒలింపిక్స్‌లో పెట్టి ప్రోత్సహించాలని కోరతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పేకాట క్లబ్బులు పేకాటకు అనుమతించాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. షాకింగ్ తీర్పు ఇచ్చింది.

13 కార్డ్స్‌కు అనుమతి ఇవ్వండి ప్లీజ్

పేకాటకు అనుమతి లేదని తెలిసినా.. చాలామంది గుట్టుచప్పుడు కాకుండా పందాలు కాసేస్తున్నారు. అలాంటి ప్రభుత్వం దానికి అనుమతి ఇస్తే ఇంకేమైనా ఉందా? చెలరేగిపోరు. అందుకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వాళ్లకు షాకిచ్చే తీర్పు ఇచ్చింది. ఏపీకి చెందిన బీమవరం కాస్మోపాలిటన్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్, నర్సాపురం యూత్ క్లబ్బులు హైకోర్టును ఆశ్రయించాయి. తమ క్లబ్‌కు వచ్చే కస్టమర్లు 13 కార్డ్స్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. దీనిపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలని పరోక్షంగా విన్నించుకున్నారు. ఒక వేళ వీరికి అనుమతి ఇస్తే.. పేకాటకు నేరుగా సపోర్ట్ చేసినట్లేనని హైకోర్టు భావించిందో ఏమో. అలా అస్సలు కుదరదని చెప్పేసింది.

డబ్బులు పెట్టి పేకాటా? నో.. నో…

Advertisement

డబ్బులు పెట్టి పేకాట ఆడితే కస్టమర్లకు కిక్ రావచ్చేమో. కానీ, పోలీసులకు మాత్రం కొత్త తలనొప్పులు వస్తాయి. కోర్టు అనుమతి ఇస్తే.. అది కేవలం ఆ మూడు క్లబ్‌లకు మాత్రమే వర్తించదు. వారి వెంట మరికొందరు కూడా వస్తారు. తమకు కూడా అనుమతి ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు. అంతేకాదు.. డబ్బులు పెట్టి పేకాట ఆడటం వల్ల కొంపలు కొల్లేరు అవుతాయి. డబ్బులన్నీ అందులోనే పెట్టి రోడ్డున పడే ఛాన్సులు ఉన్నాయి. అందుకే, కోర్టు ముందు చూపుగా.. అలాంటివి కుదరదని చెప్పేసింది. ఈ క్లబ్‌లు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. సంచలన వ్యాఖ్యలు చేసింది. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఇంకెప్పుడు ఇలాంటి విషయాల కోసం కోర్టును ఆశ్రయించవద్దు అనేలా చురకలు అంటించింది. సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో ఏపీలోని గ్రామాల్లో కోళ్ల పందాలే కాదు.. పేకాట పందేలు కూడా జోరుగా సాగుతాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమని అంటున్నారు జనాలు.

Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారా?

Tags

Related News

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×