E-Paper
Advertisement

నిన్న ఫౌజీ.. నేడు స్పిరిట్ వాయిదాల దిశగా ప్రభాస్ సినిమాలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

నిన్న ఫౌజీ.. నేడు స్పిరిట్ వాయిదాల దిశగా ప్రభాస్ సినిమాలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
Advertisement

Spirit Movie: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ (Prabhas )నటించిన ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు పూర్తిగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ సినిమా నిరాశపరిచినప్పటికీ తదుపరి రాబోయే సినిమాలపై ప్రభాస్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

వాయిదా దిశగా ప్రభాస్ సినిమాలు..

ఇక ప్రభాస్ ప్రస్తుతం హనురాగవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fauzi)సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4 వ తేదీ విడుదల కాబోతుందని చిత్ర బృందం అధికారకంగా తెలియచేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాని నేపథ్యంలో వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఈ విధంగా ఫౌజీ సినిమా వాయిదా పడటంతో ఖచ్చితంగా ఈ ప్రభావం స్పిరిట్(Spirit) సినిమాపై కూడా పడుతుందని అభిమానులు భావించారు ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా స్పిరిట్ సినిమా వాయిదా గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

స్పిరిట్ సినిమా విడుదల వాయిదా..

Advertisement

ఇకపోతే తాజాగా స్పిరిట్ సినిమా కూడా వాయిదా వేశారని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా 2027 మార్చి 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని తెలియజేశారు. అయితే తాజాగా మార్చ్ 5వ తేదీ బలగం వేణు డైరెక్షన్లో దేవిశ్రీప్రసాద్ హీరోగా నటించిన ఎల్లమ్మ (Yellamma)సినిమా విడుదలకు సిద్ధమైంది. దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మ సినిమా విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేశారు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

విడుదలకు సిద్ధమైన ఎల్లమ్మ…

ఇలా ఎల్లమ్మ సినిమా మార్చ్ 5వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో అదే రోజు విడుదల కావాల్సిన ప్రబాస్ సినిమా వాయిదా పడిందని, స్పిరిట్ వాయిదా పడటంతోనే ఎల్లమ్మ విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇలా ప్రభాస్ స్పిరిట్ సినిమా కూడా వాయిదా పడబోతుందనే విషయం తెలిసిన అభిమానులు చిత్ర నిర్మాతల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే విడుదల తేదీలను ప్రకటించడం తర్వాత వాయిదాలు వేయడం ఆనవాయితీగా మారిపోయిందని చిత్ర నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి ఈ రెండు సినిమాల కొత్త విడుదల తేదీలు ఎప్పుడు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Also Read: నేను చనిపోయాకా నా ఆస్తి మొత్తం వాళ్ళకే… రజినీకాంత్ షాకింగ్ డేసిషన్!

Related News

నేను చనిపోయాకా నా ఆస్తి మొత్తం వాళ్ళకే… రజినీకాంత్ షాకింగ్ డేసిషన్!

దేవిశ్రీప్రసాద్ ‘ఎల్లమ్మ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

పెళ్లి పీటలెక్కబోతున్న సాయి ధరంతేజ్.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

రణబాలి 2 మూవీ పై రాహుల్ బిగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలు గ్యారెంటీ!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటుడు తేజ సజ్జా.. అమ్మాయి ఎవరంటే?

వారణాసి కథ లీక్ చేసిన రాజమౌళి.. సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదంటూ!

ఖరీదైన టెస్లా కారు కొన్న సింగర్ రాహుల్.. ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×