Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2(Jailer 2) సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో రజనీకాంత్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న రజనీకాంత్ తాజాగా తమిళ ప్రజల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రజినీకాంత్ ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ఒక బస్ కండక్టర్ గా పనిచేస్తూ ఉండేవారు అయితే ఈయన ఊహించని విధంగా సినిమాలలోకి వచ్చి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం ప్రేక్షకులేనని పలు సందర్భాలలో రజనీకాంత్ తెలియజేశారు. ఇలా తనకు అంత మంచి హోదా ఇచ్చిన తమిళ ప్రజల కోసం రజనీకాంత్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలలో నటిస్తూ వేలకోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించిన రజనీకాంత్ తన మరణం తర్వాత తన ఆస్తి మొత్తం ట్రస్ట్ కు విరాళంగా అందివ్వబోతున్నట్లు తెలియజేశారు.
తన మరణం తరువాత తాను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా తన కుటుంబ తీసుకోవడానికి వీలు లేకుండా తన ఆస్తి మొత్తాన్ని చెన్నైలోనే రాఘవేంద్ర మండపం ట్రస్ట్ కు విరాళంగా ఇవ్వబోతున్నానని తెలియజేశారు. నేను నేడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బులతో టికెట్లు కొనుగోలు చేసి తన సినిమాలను చూసి తనను ఈ స్థాయికి తీసుకువచ్చారని, అలాంటి ప్రేక్షకుల కష్టం తాను మర్చిపోనని ,అందుకే తన ఆస్తి మొత్తం తన మరణం తరువాత రాఘవేంద్ర మండపం చారిటబుల్ ట్రస్ట్ కు విరాళంగా అందజేసి తద్వారా ప్రజలకు సేవ చేయాలని ఈయన సూచించారు.
ఈ విధంగా రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సంపాదించిన ఆస్తి మొత్తం తన వారసులకు చెందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ రజనీకాంత్ మాత్రం చాలా భిన్నంగా ప్రజల కోసం తన ఆస్తిని మొత్తం విరాళంగా ఇవ్వబోతున్నానని చెప్పటం గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రజనీకాంత్ కు ఇద్దరు కుమార్తెలనే విషయం మనకు తెలిసిందే. అయితే తన సంపాదించిన రూపాయి కూడా తన ఫ్యామిలీ తీసుకోవడానికి వీలులేదని ఈయన తెలియజేశారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: దేవిశ్రీప్రసాద్ ‘ఎల్లమ్మ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?