E-Paper
Advertisement

Spirit Movie: భారీ ధరలకు స్పిరిట్ ఓటీటీ డీల్ క్లోజ్… ఇదెక్కడి క్రేజ్ సామి!

Spirit Movie: భారీ ధరలకు స్పిరిట్ ఓటీటీ డీల్ క్లోజ్… ఇదెక్కడి క్రేజ్ సామి!
Advertisement

Spirit Movie: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)హీరోగా వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన ది రాజా సాబ్(The Raja Saab) సినిమా జనవరి 9వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అలాగే ప్రస్తుతం సందీప్ రెడ్డి(Sandeep Reddy) డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ (Spirit)సినిమా షూటింగ్ పనులలో కూడా ప్రభాస్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో సందీప్ రెడ్డి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త బయటకు వస్తోంది.

రూ. 160 కోట్లకు స్పిరిట్ డిజిటల్ రైట్స్..

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలయి కేవలం వారం కూడా పూర్తి కాలేదు అలాగే సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు కానీ ఈ సినిమా డిజిటల్ బిజినెస్ క్లోజ్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సమస్థ ఏకంగా 160 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నట్టు ఇండస్ట్రీ సమాచారం. ఇలా సినిమా నుంచి ఇప్పటివరకు ఒక చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా ఈ స్థాయిలో డిజిటల్ హక్కులు (Digital Rights)అమ్ముడుపోవడం అంటే మామూలు విషయం కాదు. ఇలా డిజిటల్ హక్కుల కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేశారు అంటే అది కేవలం సందీప్ రెడ్డి పై ఉన్న నమ్మకమే అని తెలుస్తుంది.

స్పిరిట్ డిజిటల్ బిజినెస్ క్లోజ్..

Advertisement

ఇకపోతే ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ బిజినెస్ ఇంకా పూర్తి కాకపోవటం గమనార్హం. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఫౌజీ సినిమా డిజిటల్ బిజినెస్ కూడా పూర్తి కాలేదు కానీ సందీప్ రెడ్డి సినిమాకు మాత్రం ఇలా ఓటిటి డీల్ పూర్తి కావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఇకపై 6 నెలలు కనిపించని ప్రభాస్..

Advertisement

ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ లీక్ అవ్వకుండా ఉండడం కోసం ప్రభాస్ ఆరు నెలలపాటు ఎక్కడ బయట కనిపించకూడదనే కండిషన్లు కూడా సందీప్ రెడ్డి పెట్టినట్టు తెలుస్తోంది . ఇలా ప్రభాస్ ఆరు నెలలు బయట కనిపించకూడదు అంటే త్వరలో ఈయన నుంచి విడుదల కాబోయే ది రాజా సాబ్ సినిమా ప్రమోషన్లకు కూడా ప్రభాస్ హాజరుకారా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.. ఇక స్పిరిట్ సినిమా డిసెంబర్ చివరి వరకు షూటింగ్ పనులను జరుపుకోబోతుందని సమాచారం. ఈ సినిమాలు ప్రభాస్ కి జోడిగా త్రిప్రి దిమ్రి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రకాష్ రాజు, వివేక్ ఒబెరాయ్, డాన్ లీ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా ఈ సినిమాల్లో కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.

Also Read: Actor MS Umesh Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×