E-Paper
Advertisement

Actor MS Umesh Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Actor MS Umesh Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!
Advertisement

Actor MS Umesh Death: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతవారం ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త మర్చిపోకముందే మరొక స్టార్స్ కమెడియన్ మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.కన్నడ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నటుడు ఉమేష్ (మీ.S.Umesh)నేడు మరణించారు. 80 సంవత్సరాల వయసు ఉన్న ఉమేష్ అనారోగ్య సమస్యల కారణంగా మరణించారని తెలుస్తోంది.

అనారోగ్య సమస్యలతో ఉమేష్ మరణం..

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో నేడు తుది శ్వాస విడిచారు.1960లో చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఉమేష్‌ ఇప్పటివరకు 350కిపైగా సినిమాలలో నటించి తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. సుమారు 60 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన నటుడు ఉమేష్ మరణ వార్త కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతకి గురిచేస్తుంది. ఈయన మరణ వార్త తెలియడంతో కన్నడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయన మరణం పై స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

మైసూర్ శ్రీకాంతయ్యా ఉమేష్..

Advertisement

ఉమేష్ అసలు పేరు మైసూర్ శ్రీకాంతయ్యా ఉమేష్ ఈయన గత కొంతకాలంగా క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా క్యాన్సర్ తో బాధపడుతున్న ఉమేష్ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఈయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణించిన నేపథ్యంలో కన్నుమూశారు. ఇక ఈయన ఆరు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో అవార్డులను, పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఉమేష్ నటించిన సినిమాలలోనాగరహోళె, గురు శిష్యుడు, అనుపమ, కమనబిల్లు, అపూర్వ సంగమం, శృతి సెరిదగ, హాలు జేను, గోల్‌మాల్ రాధాకృష్ణ వంటి సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి.

క్యాన్సర్ తో మరణించిన ఉమేష్..

Advertisement

ఇలా ఆరు దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించిన ఉమేష్ మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇలా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన తన చివరి రోజుల వరకు కూడా సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలాంటి ఒక గొప్ప నటుడిని కన్నడ చిత్ర పరిశ్రమ కోల్పోవడంతో ఇండస్ట్రీ మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి .ఇక ఈయన మరణం వార్త తెలిసిన వెంటనే ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు, అభిమా ఈయన ఇంటికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.

AlsoRead: Ranveer Singh: కాంతార పై రణవీర్ సింగ్ కామెంట్స్… క్షమాపణలు డిమాండ్ చేస్తున్న కన్నడిగులు!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×