Akshaya Tritiya 2026: హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ రోజున చేసే ఏ చిన్న పని అయినా.. కొనే ఏ వస్తువు అయినా ‘అక్షయం’ అవుతుందని, అంటే ఎప్పటికీ తరిగిపోదని నమ్ముతారు. అయితే.. అందరూ బంగారం కొనడం సాధ్యం కాకపోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా.. బంగారం కంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. మరి మీ రాశి ప్రకారం మీకు కలిసి వచ్చే ఆ అదృష్ట వస్తువు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రాశి ప్రకారం అదృష్టాన్ని కొనేయండి!
అక్షయ తృతీయ అంటే కేవలం.. నగలు కొనే పండగ మాత్రమే కాదు. ఇది సకల శుభాలకు సంకేతం. 2026లో ఏప్రిల్ నెలలో రానున్న ఈ పర్వదినం నాడు మీ గ్రహ గతులు, రాశి చక్రం ఆధారంగా కొన్ని వస్తువులను కొంటే.. మీ ఇంట్లో సిరిసంపదలు తాండవిస్తాయి.
మేష రాశి :
మేష రాశి వారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం బెస్ట్. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. వీరు కందులు లేదా ఏదైనా ఎర్రటి వస్తువును కొనుగోలు చేయాలి. దీనివల్ల కుజుడి అనుగ్రహం కలిగి ఆస్తి సంబంధిత గొడవలు తొలగిపోతాయి.
వృషభ రాశి :
ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరు వెండి వస్తువులు లేదా వజ్రాలను కొంటే చాలా మంచిది. కుంకుమ లేదా బియ్యాన్ని కొనుగోలు చేయడం కూడా వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
మిథున రాశి :
మిథున రాశి వారు ఈ రోజున పెసర పప్పు లేదా పచ్చని రంగులో ఉన్న వస్తువులను కొనాలి. ఇది మీ వ్యాపారంలో లాభాలను పెంచుతుంది. అలాగే.. ఏదైనా పుస్తకం లేదా పెన్ను కొనడం కూడా మీకు విద్యాపరంగా కలిసి వస్తుంది.
కర్కాటక రాశి:
చంద్రుడు అధిపతిగా ఉన్న కర్కాటక రాశి వారు ముత్యాలు లేదా వెండిని కొనుగోలు చేయడం శ్రేయస్కరం. బంగారం కొనాలనుకుంటే చిన్న నాణెం అయినా సరే కొనండి. తెలుపు రంగు వస్తువుల కొనుగోలు మీకు మానసిక శాంతిని ఇస్తుంది.
సింహ రాశి :
సింహ రాశి వారు ఈ పవిత్రమైన రోజున బంగారం కొనడం అత్యంత శుభప్రదం. ఒకవేళ కుదరకపోతే రాగి పాత్రలు లేదా గోధుమలను కొనుగోలు చేయండి. ఇది మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది.
కన్య రాశి :
కన్య రాశి వారు పచ్చలు లేదా పెసలు కొనాలి. మీ ఇంట్లోకి కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును లేదా వంటగదికి సంబంధించిన సామాగ్రిని కొన్నా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
తుల రాశి :
ఈ రాశి వారు సుగంధ ద్రవ్యాలు, వెండి లేదా తెల్లటి వస్త్రాలను కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు. ఇది మీ దాంపత్య జీవితంలో సంతోషాన్ని నింపుతుంది.
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి వారు బెల్లం లేదా పగడాలను కొనడం వల్ల అదృష్టం వరిస్తుంది. ఎర్రటి రంగు బట్టలు లేదా రాగి వస్తువులు కూడా వీరికి కలిసి వస్తాయి.
ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి వారికి గురు గ్రహం అధిపతి. వీరు బంగారం లేదా పసుపు రంగు వస్తువులను కొనాలి. శనగ పప్పు లేదా అరటి పండ్లను కొని దానం చేయడం వల్ల కూడా వీరికి పుణ్యఫలం లభిస్తుంది.
Also Read: అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొనాలి? దీని వెనక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా?
మకర రాశి :
మకర రాశి వారు నల్ల నువ్వులు లేదా ఐరన్ తో చేసిన వస్తువులను కొనడం వల్ల శని దేవుని ఆశీస్సులు లభిస్తాయి. వీరు వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ రోజు చాలా అనువైనది.
కుంభ రాశి :
కుంభ రాశి వారు నీలమణి లేదా నల్లటి బట్టలు, ఏదైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడం మంచిది. సామాజిక సేవ కోసం ఈ రోజు ఏదైనా వస్తువును దానం చేయడం మీకు కలిసి వస్తుంది.
మీన రాశి :
మీన రాశి వారు పసుపు లేదా బంగారం కొనడం బెస్ట్. ఏదైనా మతపరమైన పుస్తకాలను కొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
అక్షయ తృతీయ నాడు మీ స్తోమతను బట్టి.. రాశిని బట్టి చిన్న వస్తువు కొన్నా సరే, దానిని పూర్తి నమ్మకంతో, భక్తితో కొనండి. కేవలం వస్తువులు కొనడమే కాకుండా.. ఈ రోజున పేదలకు అన్నదానం లేదా జలదానం చేయడం వల్ల మీ పుణ్యఫలం అక్షయం అవుతుంది. ఈ చిట్కాలతో మీ అక్షయ తృతీయను మరింత ప్రత్యేకంగా మార్చుకోండి.