E-Paper
Advertisement

వంగ మార్క్ వైలెన్స్ vs వంశీ పైడిపల్లి క్లాస్.. 2027 ఈద్ విన్నర్ ఎవరు?

వంగ మార్క్ వైలెన్స్ vs వంశీ పైడిపల్లి క్లాస్.. 2027 ఈద్ విన్నర్ ఎవరు?
Advertisement

Eid Clash : నిన్నటిదాకా చిన్న డైలమా ..బీ టౌన్ లో వినిపిస్తున్నట్టుగా సల్మాన్, ప్రభాస్ బాక్సాఫీస్ బరిలో ఒకేసారి దిగబోతున్నారా లేదా అవన్నీ రూమర్సేనా అని. కానీ ఈ డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ సందీప్ వంగా..అవును..చెప్పినట్టుగానే స్పిరిట్ సినిమాని ఈద్ రోజున ..అంటే మార్చి 5, 2027న పక్కాగా థియేటర్లలోకి తీసుకొస్తామంటూ కుండబద్దలు కొట్టేశాడు.సరిగ్గా ఇదే ఈద్ రోజున సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా (SVC 63) కూడా బరిలోకి దిగుతుందని ఇప్పటికే మేకర్స్ చెప్పేశారు.దీంతో బాక్సాఫీస్ వార్ లో ఇద్దరు స్టార్ హీరోలు తలబడబోతున్నారని కన్ఫాం అయిపొయింది.

ప్రభాస్ ‘స్పిరిట్’.. ప్లస్ పాయింట్స్

Advertisement

స్పిరిట్ విషయానికే వస్తే ..యానిమల్’ సినిమాతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్షన్ చేయడం ఒక ప్లస్ పాయింట్. ఇక దీనికి తోడు ‘సలార్’, ‘కల్కి’ సక్సెస్ తో గ్లోబల్ రేంజ్ ఇమేజ్ కొట్టేసిన ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించడం మరొక ప్లస్ పాయింట్.వంగా మార్క్ వైలెన్స్, ఎమోషన్ కి డార్లింగ్ మాస్ ఇమేజ్ కలిస్తే రికార్డులు రీ రైట్ చేయాల్సిందే అన్నది ట్రేడ్ వర్గాల మాట.ఇక ఆ రోజు సల్మాన్ వస్తున్నాడని తెలిసినా సందీప్ తగ్గేదిలే అంటున్నాడంటే స్పిరిట్ లో ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ని దాచాడో అర్థమవుతుంది.ఈ కాన్ఫిడెన్సే ఆడియన్స్ లో అంచనాలు మరింత పెరగడానికి కారణం.

also read: భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతుల మీదుగా ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్

Advertisement

సల్మాన్ ఖాన్ ‘SVC 63’.. మైనస్ అయ్యే ఛాన్స్
ఇక సల్మాన్ విషయానికే వస్తే సల్లూ బాయ్ సినిమా వస్తుందంటే నార్త్ బెల్ట్ ఏ రేంజ్ లో ఊగిపోతుందో చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా సల్మాన్ సినిమాలకు సరైన సక్సెస్ రాలేదు. పైగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ అంటే క్లాస్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ.. మాస్ అండ్ రా ఎనర్జీతో వచ్చే వంగా సినిమాను తట్టుకోవడం అంటే సల్మాన్ కి తలకి మించిన భారంలాగే కనిపిస్తుంది. పైగా ‘యానిమల్’ తర్వాత నార్త్ ఆడియన్స్ వంగా సినిమాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారన్నది కాదనలేని సత్యం.ఒకరకంగా ఇదే మన డార్లింగ్ కి పెద్ద అడ్వాంటేజ్అనే చెప్పాలి.

ఎవరికి ప్లస్? ఎవరికి మైనస్?

ఇకపోతే బాహుబలి తర్వాత మారిన ట్రెండ్ చూస్తె సౌత్ మొత్తం ప్రభాస్ కి గంపగుత్తగా క్యూ కట్టడం ఖాయం.హిందీ లో వంగా క్రేజ్ ఉండనే ఉంది.ఎటొచ్చి నార్త్ పైనే ఇంకాస్త సాలిడ్ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి.అది వర్కౌట్ అయితే మాత్రం హిందీలో అదిరిపోయే ఓపెనింగ్స్ పక్కా ..ఇక సినిమా బాగుందన్న టాక్ వస్తే సల్మాన్ సినిమా కలెక్షన్లను డామినేట్ చేయడం పెద్ద కష్టం కాదు కూడా.పైగా సల్మాన్ కేవలం హిందీ మార్కెట్ మీద మాత్రమే ఆధారపడాలి. కానీ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం వల్ల అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం ఖాయం. సల్మాన్ సినిమాకు ఏమాత్రం టాక్ తేడా వచ్చినా, ‘స్పిరిట్’ సునామీలో కొట్టుకుపోవడం పక్కా.

సో ఏ లెక్క చూసినా సల్మాన్ మీద డార్లింగ్ సినిమానే డామినేషన్ చూపించేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఎవరమూ తగ్గమంటూ ఒకే రోజు రెండు సినిమాలు పోటాపోటీగా బరిలోకి దిగుతాయా..లేక ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఏదైనా వెనక్కి తగ్గుతాయా !

also read: చరణ్ వర్సెస్ వరుణ్ .. బాక్సాఫీస్ లెక్కలు తారుమారు కాబోతున్నాయా?

 

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×