E-Paper
Advertisement

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతుల మీదుగా ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతుల మీదుగా ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్
Advertisement

Ugly Story : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నందు, ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం, తాజాగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ‘భీమ్లా నాయక్’ ఫేమ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ ఘనంగా విడుదలయ్యింది.

ఆకట్టుకుంటున్న ట్రైలర్.. ఇంటెన్స్ అండ్ బోల్డ్
సాధారణంగా ప్రేమకథలంటే మధురమైన జ్ఞాపకాలు, అందమైన ప్రయాణం అనుకుంటాం. కానీ ‘అగ్లీ స్టోరీ’ అందుకు భిన్నంగా ఉంటుంది. “ప్రతి ప్రేమ వెనుక ఒక చీకటి కోణం ఉంటుంది” అనే పాయింట్‌ను ఈ ట్రైలర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. ఇంటెన్స్ నెరేషన్, గుండె బరువెక్కించే ఎమోషన్స్, మరియు ఊహించని ట్విస్టులతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నందు, అవికా గోర్ మధ్య వచ్చే సీన్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయనే చెప్పాలి.

Advertisement

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ టీం సందడి
ఈ సందర్భంగా జరిగిన వేడుకలో డైరెక్టర్ సాగర్ కె చంద్ర మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా ఇంటెన్సివ్ గా ఉంది. విజువల్స్, మ్యూజిక్ సినిమా మూడ్‌ను పర్ఫెక్ట్‌గా క్యారీ చేస్తున్నాయి. ఈ సినిమా టీం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. మే 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.దర్శకుడు ప్రణవ స్వరూప్ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.. “ప్రేమలోని వాస్తవాలను, సంఘర్షణను ధైర్యంగా చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. నందు, అవికా తమ పాత్రలకు ప్రాణం పోశారు. నిర్మాతలనుంచి నాకు లభించిన సపోర్ట్ వల్లే క్వాలిటీ అవుట్ పుట్ వచ్చింది” అన్నారు.

also read :చరణ్ వర్సెస్ వరుణ్ .. బాక్సాఫీస్ లెక్కలు తారుమారు కాబోతున్నాయా?

Advertisement

హీరో,హీరోయిన్స్ మాట్లాడుతూ 
హీరో నందు మాట్లాడుతూ ఇది నా కెరీర్‌లో ఒక ఛాలెంజింగ్ రోల్. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త యాంగిల్‌లో నన్ను చూస్తారు. ఈ థ్రిల్లింగ్ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.ఇక ప్రేమలోని రియాలిటీని చూపించే అద్భుతమైన కథ ఇది. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.ఉంది అంటూ చెప్పుకొచ్చింది అవికా గోర్.

సమ్మర్ లో ఇదొక బ్లాక్ బస్టర్ హిట్

ఇక సినిమా మేకింగ్ లో రియా జియా పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయనే చెప్పాలి.శ్రావణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లగా, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.ఇక నిర్మాతలు సుభాషిణి, లక్ష్మణ్ సినిమా పట్ల తమదైన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయగా,నిర్మాత బెక్కం వేణు గోపాల్ ఈ సినిమా సక్సెస్ పై ధీమా వ్యక్తం చేస్తూ, ఈ సమ్మర్ లో ఇదొక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్విస్టులతో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ‘అగ్లీ స్టోరీ’ ఒక పర్ఫెక్ట్ ట్రీట్ లా ఉండబోతోందని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. మరి  ఈ అసలైన ‘అగ్లీ’ స్టోరీ తెలుసుకోవాలంటే మాత్రం మే 22న థియేటర్లకు రావాల్సిందే!

also read :పోలీస్ స్టేషన్ లో ‘ఏందయ్య సామీ’.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

Big Stories

Advertisement
×