PCB: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) మొన్నటి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో బాబర్ ఆజం సేన విక్టరీ సాధించింది. చాంపియన్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం (Babar Azam) పేరు మారు మోగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ( Pakistan Cricket Board) ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. PSL 2026 కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడ్డట్టు సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. దాదాపు రూ. 500 కోట్ల నష్టం వాటిని నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) తల పట్టుకున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) దాదాపు నెల రోజులకు పైగా జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్… మొన్న మే మూడవ తేదీ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ట్రోఫీని బాబర్ ఆజం సేన దక్కించుకుంది. హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో అద్భుతంగా రాణించిన బాబర్ ఆజం సేన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ టోర్నమెంట్ ఫినిష్ అయిన నేపథ్యంలో షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడే అవకాశాలు ఉనట్టు చెబుతున్నారు. PSL టోర్నమెంట్ లో పాల్గొన్న ఫ్రాంఛైజీలు, బ్రాడ్ కాస్టర్లు, ఇతర వ్యాపార భాగస్వాములు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెల్లించాల్సిన బిలియన్ల రూపాయలను కట్టలేదట. దాదాపు నాలుగు నుంచి ఐదు మిలియన్ల బకాయిలను పైన పేర్కొన్న ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టర్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. అంటే దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని అంటున్నారు. టోర్నమెంట్ ఫినిష్ అయి, వారం రోజులు కావస్తున్నా కూడా డబ్బులు చెల్లించేందుకు ముందుకు రాలేదట. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టర్లు, ఇతర వ్యాపార భాగస్వాములు బోర్డుకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వక పోవడంతో లీగల్ నోటీసులు జారీ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. వారంలో రోజుల్లోగా ఈ డబ్బులను చెల్లించాల్సిందేనని నోటీసులలో పేర్కొంది.
Also Read: Tanveer Ahmed: బాబర్ ఒక్క టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed
🔴 BIG EMBARRASSING MOMENT FOR PAKISTAN CRICKET 🤯
PCB has sent legal notices to several PSL franchises, broadcasters, & business partners over unpaid dues worth billions of rupees 💰
Or they Compare PSL with World best league IPL 😭pic.twitter.com/Yroz05HycO
— Sam (@Cricsam01) May 6, 2026