Anil Ravipudi: టాలీవుడ్‌లో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కామెడీ, ఎమోషన్, కుటుంబ విలువలు కలిపి సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వస్తే.. అనిల్ రావిపూడి పేరు తప్పకుండా వినిపిస్తుంది. గత కొన్ని ఏళ్లుగా ఆయన తీసిన సినిమాలు పండుగల సమయంలో.. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చాయి. అంతేకాకుండా భారీ విజయాలు కూడా అందుకున్నాయి..
గత సంవత్సరం విడుదలైన భగవంతు కేసరి సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈ ఏడాది.. సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.. ఈ చిత్రాన్ని కుటుంబ ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. ఇప్పుడు 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమాతో రాబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరం ముగింపు సమయంలో అనిల్ రావిపూడిని కొన్ని ప్రశ్నలు అడగగా.. ఆయన ఇచ్చిన సమాధానాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఈ ఏడాది తనను బాగా ఆకట్టుకున్న సినిమాగా అనిల్ రావిపూడి కోర్ట్ సినిమాను చెప్పారు. సినిమా కథ.. భావోద్వేగాలు.. నటన అన్నీ సమతూకంగా ఉన్నాయని తెలిపారు. తన సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాకుండా తనకు ఈ కోర్ట్ సినిమా చాలా నచ్చింది అని తెలిపారు. నాని నిర్మించిన ఈ చిత్రం ఈ సంవత్సరం మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక పాటల విషయానికి వస్తే ముందుగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టుపైన పాట తనకు చాలా నచ్చిందన్నారు. ఆ తర్వాత కోర్ట్ సినిమాలోని ప్రేమలో పాట తనకు బాగా నచ్చిందని ఆ పాతని హమ్ కూడా చేశాడు. ఈ పాటలు వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుందని చెప్పారు.
నటన విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ చేసిన పాత్ర తనకు చాలా నచ్చిందని అనిల్ రావిపూడి చెప్పారు. అలాగే కోర్ట్ సినిమాలో ఇద్దరు ప్రధాన నటులు.. అద్భుతంగా నటించారని తెలిపారు. అంతేకాకుండా ఆ సినిమాలో.. శివాజీ నటన తనను బాగా ఇంప్రెస్ చేసిందన్నారు. ఆయన అద్భుతంగా చేశారు అని చెప్పుకొచ్చాడు.
అలాగే మిరాయిలో మనోజ్.. తేజ.. ఇద్దరు కూడా మంచి నటన చూపించారని పేర్కొన్నారు. ఇక ఓజీలో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ని.. ఆ స్టైల్లో.. చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందని చెప్పారు. ఇక అనిల్ రావిపూడి చెప్పిన ఈ మాటను ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.
మరో పక్క ఇప్పటికే సంక్రాంతికి రానున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ లో తెగ పాల్గొంటున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం నుంచి విడుదలైన 3 పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి.. ఏడాది చివరిలో విడుదలైన చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన పాట.. ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్స్ లో ఈ పాటకు ఫాన్స్ కి పూనకాలు రావడం ఖాయం అంటూ అందరూ ఫిక్స్ అయిఉన్నారు.
ALSO READ: Romantic drama OTT : ఎక్స్ లవర్ తో ఏకాంతంగా… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ రొమాంటిక్ డ్రామా