E-Paper
Advertisement

The Raja Saab : నాలుగు పాటలు షూట్ పూర్తయ్యాయి , కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

The Raja Saab : నాలుగు పాటలు షూట్ పూర్తయ్యాయి , కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

The Raja Saab : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. సంక్రాంతి కనుక ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు ఎప్పుడూ అనౌన్స్ చేశారు. మధ్యలో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని వార్తలు కూడా వచ్చాయి. వీటన్నిటి విషయంలో కూడా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ 23వ తారీఖున విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే.

మామూలుగా ఒక సినిమాకి సంబంధించి పాటలు ముందు విడుదలవుతాయి. కానీ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ట్రైలర్ విడుదల అయిపోయింది. కానీ పాటలు ఇంకా విడుదల కాలేదు. ఒక పాట కూడా విడుదల కాకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొద్దిపాటి నిరాశ చెందారు. అసలు పాటను తమన్ ఇవ్వలేదా, అసలు ఈ సినిమా విషయంలో ఏం జరిగింది అనే క్లారిటీ చాలామందికి లేదు. సరైన విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి నాలుగు పాటలు పూర్తయిపోయాయి.

షూటింగ్ పూర్తి

రాజా సాబ్ సినిమాకి సంబంధించి నాలుగు పాటలను తమన్ కంప్లీట్ చేశాడు. మొదటిగా రానున్న రెబల్ సాబ్ పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు. కృష్ణ కాంత్ రెండు మెలోడీస్ రాశారు. మాస్ సాంగ్ కాసర్లశ్యామ్ రాశారు. నాలుగు పాటలు షూట్ పూర్తయ్యాయి.

పాటలు షూటింగ్ చేసుకోవడానికి మాత్రమే వీలుగా కొన్నిసార్లు ఇస్తుంటారు. ఆ తరువాత ఆ పాటలోని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తది. దీనిని బట్టి నాలుగు సాంగ్స్ షూటింగ్ అయిపోయాయి అంటే తమన్ ఆల్రెడీ ట్యూన్స్ ఇచ్చేసాడు. కేవలం ఆ పాటలకు కొంచెం కరెక్షన్స్ మాత్రమే చేయాల్సి ఉంది. తమన్ ఒకవైపు అఖండ పనుల్లో బిజీగా ఉంటూ కూడా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేశాడు.

పోటీ తప్పింది 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో ఇదే డేట్ కు రాజా సాబ్ సినిమాను అనౌన్స్ చేశారు. డేట్ హిందీ మార్కెట్ కి చాలా అనుకూలంగా ఉంది. కానీ తెలుగు మార్కెట్ టార్గెట్ చేయాలి అంటే సంక్రాంతి బెటర్ అని రాజా సాబ్ వాయిదాకి వెళ్ళిపోయింది.

ఒకవేళ రెండు సినిమాలు ఒకేరోజు తెలుగులో విడుదలై ఉంటే, టాక్ విషయం పక్కన పెడితే రెండు సినిమాలకి తమన్ మ్యూజిక్ కాబట్టి అది ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉండేది. మొత్తానికి రాజా సాబ్ సినిమా వాయిదా పడటం వలన పోటీ కూడా తప్పింది.

Also Read: Raju Weds Ramabai : అమీర్పేట్ వ్యాఖ్యలపై మాట మార్చిన డైరెక్టర్… సారీ చెబుతూ..

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×