E-Paper
Advertisement

Siricilla News: సిరిసిల్ల సెస్ కార్యాలయంలో శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య స్వామి పూజలు..

Siricilla News: సిరిసిల్ల సెస్ కార్యాలయంలో శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య స్వామి పూజలు..
Advertisement

Siricilla News: సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు  కలకలం రేపాయి. సెస్ కార్యాలయ ప్రాంగణంలోని క్యాష్ సెక్షన్ గదిలో బుధవారం శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.

పూజ అనంతరం స్వామీజీ సెస్ కార్యాలయం వాస్తుకు లోపం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా చైర్మన్ కుర్చీలో కూర్చుని అధికారులకు ఉద్యోగులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యాలయం వాస్తు లోపాలు సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్వామీజీ చైర్మన్ కుర్చీలో కూర్చొని మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

సెస్ కార్యాలయంలో స్వామీజీ పూజలు నిర్వహించడంపై రాష్ట్రంలో భిన్న చర్చలు సాగుతున్నాయి. ఇటివల సెస్ కార్యాలయంలో వరుస తనిఖీలు, విజిలెన్స్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు తనిఖీల నేపథ్యంలో సంస్థలో నెలకొన్న అశాంతి నివారణకు, కార్యాలయానికి శాంతి చేకూరడం కోసం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. సెస్ అధికారులే ఈ పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రత్యేక పూజకు కొందరు సెస్ డైరెక్టర్లు హాజరు కాలేదు. ముఖ్యమైన డైరెక్టర్లు గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై డైరెక్టర్లలో లోలోపల అసంతృప్తి ఉందనే వార్తలకు ఇది బలం చేకూర్చుతోంది. పూజ నిర్వహణ దాని ఉద్దేశంపై కూడా డైరెక్టర్ల మధ్య ఏకాభిప్రాయం లేదనే చర్చ నడుస్తోంది. ఏదేమైనా సెస్ కార్యాలయంలో స్వామీజీ పూజలు వాస్తు సూచనలు జిల్లాలో ప్రధాన వార్తగా మారాయి.

Advertisement

ALSO READ: BC Reservations: బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం.. మరో భారీ ఉద్యమం చేయాల్సిందే.. ఆర్ నారాయణ మూర్తి మాస్ వార్నింగ్

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×