E-Paper
Advertisement

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్  దెబ్బకు షేక్ అయిన హాట్ స్టార్.. ఇలా ఉన్నారేంట్రా బాబు..

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్  దెబ్బకు షేక్ అయిన హాట్ స్టార్.. ఇలా ఉన్నారేంట్రా బాబు..

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్(The Raja Saab) సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ థియేటర్లలో మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో విఫలం కావడంతో ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. సుమారు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సగం కలెక్షన్లను కూడా రాబట్ట లేకపోయింది.

రిమైండ్ మి బటన్లను నొక్కిన ఫ్యాన్స్..

ఇలా ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత దారుణమైన కలెక్షన్లను రాబట్టిన సినిమాగా రాజా సాబ్ నిలిచిందని చెప్పాలి. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా మరికొన్ని గంటలలో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్(Jio Hotstar) కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే జియో హాట్ స్టార్ ఏ విధమైనటువంటి కట్స్ లేకుండా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు జియో హాట్ స్టార్ తెలియజేశారు అయితే ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల చేసిన పనికి హాట్ స్టార్ షేక్ అయిందని తెలుస్తోంది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రాగానే తమకు నోటిఫికేషన్ వచ్చేలాగా ప్రభాస్ అభిమానులు రిమైండ్ మి బటన్లను క్లిక్ చేశారు.

సర్వర్లు అప్ గ్రేడ్

ఇలా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ముందుగానే ఈ బటన్ నొక్కడంతో జియో హాట్ స్టార్ లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా హాట్ స్టార్ కు ట్రాఫిక్ వచ్చి పడింది. దీంతో హాట్ స్టార్ యాజమాన్యం తమ సర్వర్లను అప్ గ్రేడ్ చేసి పెట్టినట్టు అధికారకంగా తెలియచేశారు. ఇలా ప్రభాస్ సినిమా కోసం తమ సర్వర్లను కూడా అప్ గ్రేడ్ చేసి పెట్టారంటే ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా ఆదరణ లేకపోయినా ఇక్కడ మాత్రం మంచి ఆదరణను దక్కించుకోబోతోందని స్పష్టమవుతుంది.

80 కోట్ల ఓటీటీ డీల్..

ఇక ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాకు లేనివిధంగా ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా ఏకంగా 80 కోట్లకు పైగా అమ్ముడుపోయాయని తెలుస్తోంది. మరి కొన్ని గంటలలో ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు మారుతి దశకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇందులో సంజయ్ దత్ వంటి బాలీవుడ్ హీరోలు కూడా భాగమయ్యారు. ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Gunasekhar: మళ్లీ జన్మంటూ ఉంటే అలా పుట్టకూడదు.. గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×