E-Paper
Advertisement

Prabhas: ఏంటీ డార్లింగ్ లైఫ్ లో లవ్ లేదు…లవ్ స్పెల్లింగ్ అయినా కరెక్ట్ రాయొచ్చుగా?

Prabhas: ఏంటీ డార్లింగ్ లైఫ్ లో లవ్ లేదు…లవ్ స్పెల్లింగ్ అయినా కరెక్ట్ రాయొచ్చుగా?
Advertisement

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన సందీప్ రెడ్డి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్పిరిట్ సినిమా పనులలో పాల్గొన్నారు. కొద్దిరోజుల పాటు స్పిరిట్ సినిమాకు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం జపాన్(Japan) పర్యటనలో ఉన్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలు కలిపి ఒకే భాగంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి ది ఏపిక్ పేరిట(Bahubali The Epic) ఈ సినిమా విడుదలయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

జపాన్ పర్యటనలో ప్రభాస్…

ఇకపోతే ఈ సినిమా జపాన్లో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ అలాగే నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్లో పర్యటిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ అక్కడ అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్నటువంటి ఒక  వీడియో బయటకు వచ్చింది. ఇందులో భాగంగా లవ్ స్పెల్లింగ్ మిస్టేక్ రాయడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. Love అని కాకుండా.. Loe అని రాశారు. అనంతరం తేరుకొని ఆ స్పెల్లింగ్ కరెక్ట్ చేస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

లవ్ స్పెల్లింగ్ తప్పు రాసిన ప్రభాస్..

Advertisement

ఏంటి డార్లింగ్ కనీసం లవ్ స్పెల్లింగ్ రాయలేకపోతున్నారా అంటూ కొంతమంది కామెంట్ చేయగా మరి కొంతమంది మన లైఫ్ లో లవ్ ఎలాగో లేదు.. కనీసం స్పెల్లింగ్ అయినా కరెక్ట్ రాయొచ్చు కదా డార్లింగ్ అంటూ ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మా రాజు గారి లైఫ్ లో లవ్ లేదు కాబట్టే స్టార్ హీరో అయ్యారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ సాధారణంగా ఎంతో మొహమాటం కలిగిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. ఆయన అభిమానులతో కలవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది మొదటిసారి జపాన్ లో అభిమానులను మీట్ అవ్వడంతో కాస్త గందరగోళానికి గురయ్యారని చెప్పాలి.

Advertisement

ఇలా ప్రభాస్ మాత్రమే కాకుండా గతంలో అల్లు అర్జున్ కూడా ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ రాయడంతో భారీగానే విమర్శలను ఎదుర్కొన్నారు. గతంలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి సంబంధించి అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా వైజాగ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. ఇందులో వైజాగ్ స్పెల్లింగ్ Vizag అని కాకుండా Vigaz అని రాయడంతో అప్పట్లో కూడా అల్లు అర్జున్ పై విమర్శలు వచ్చాయి. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోలు చిన్న చిన్న స్పెల్లింగ్స్ మిస్టేక్స్ చేయడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇక ఇద్దరి హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Akhanda 2: అఖండ 2 కోసం బాలయ్య కాంప్రమైజ్ … కలవడాలు కాంప్రమైజ్ లు లేవన్నఇరోస్  !

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×