E-Paper
Advertisement

Akhanda 2: అఖండ 2 కోసం బాలయ్య కాంప్రమైజ్ … కలవడాలు కాంప్రమైజ్ లు లేవన్న ఇరోస్ !

Akhanda 2: అఖండ 2 కోసం బాలయ్య కాంప్రమైజ్ … కలవడాలు కాంప్రమైజ్ లు లేవన్న ఇరోస్ !
Advertisement

Akhanda 2: అఖండ సినిమాకు ఫైనాన్స్ ఇబ్బందులు చోటు చేసుకోవడంతో చివరి నిమిషంలో విడుదలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడిన నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా 14 ప్లస్ రీల్స్ నిర్మాతలు ఇరస్ ప్రొడక్షన్ వారికి పెద్ద ఎత్తున డబ్బు చెల్లించాల్సి ఉంది . అది పూర్తి చేసిన తరువాతనే అఖండ సినిమా విడుదలకు అనుమతి ఉంటుందని చెప్పడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే నిర్మాతలు ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వనున్న బాలయ్య..

ఇక ఈ సినిమాకు ఫైనాన్స్ ఇబ్బందులు తలెత్తడంతో బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ తన వంతు సాయంగా నిలిచారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్య 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. బోయపాటి శ్రీను 35 కోట్లు, తమన్ 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఈ సినిమాను ప్రెసెంట్ చేసిన నేపథ్యంలో ఆమె కూడా ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సమస్యల కారణంగా బాలకృష్ణ తన రెమ్యూనరేషన్ నుంచి 5 కోట్ల రూపాయలు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చారట అలాగే బోయపాటి శ్రీను కూడా 10 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా వీరంతా తమ రెమ్యూనరేషన్ వెనక్కు ఇస్తామని హామీ ఇవ్వడంతో లోకల్ గా ఉన్న ఫైనాన్స్ సమస్యలన్నీ కూడా క్లియర్ అయ్యాయని తెలుస్తోంది.

నిర్మాతలను కలవడానికి ఇష్టపడని ఇరోస్..

Advertisement

ఇక ఆఖండ విడుదలకు సమస్య మొత్తం ఇరోస్ వారితోనేనని స్పష్టమవుతుంది. 14 ప్లస్ రీల్స్ నిర్మాతలు ఇరోస్ నుంచి 26.4 కోట్లను అధిక వడ్డీకి తీసుకువచ్చారని తెలుస్తోంది. ఈ డబ్బుకు వడ్డీ మాత్రమే 24.7 కోట్లు అయ్యిందని, ఇలా అసలు వడ్డీ మొత్తం కలుపుకుంటే 14 రీల్స్ ఇరోస్ వారికి ఏకంగా 51 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ ఫైనాన్స్ సెటిల్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం కోసం 14 రీల్స్ ట్రై చేస్తున్నారు అందుకోసమే నిర్మాతలు ముంబైకి కూడా వెళ్లారట. ఈ నిర్మాతలతో కలవడానికి కూడా ఇష్టపడని ఇరోస్ వీరు వస్తున్నారనే విషయం తెలుసుకుని ఢిల్లీ వెళ్లిపోయారట.

లీగల్ గా వెళ్లనున్న ఇరోస్..

Advertisement

ఈ డబ్బుల విషయంలో ఇరోస్ వారు 14 రీల్స్ ప్లస్ వారితో ఎలాంటి కాంప్రమైజ్ లు అవసరం లేవని, ఈ విషయంలో లీగల్ గా వెళ్లడానికి సిద్ధమయ్యారట ఒకవేళ 14 రీల్స్ నిర్మాతలు తమకు చెల్లించాలి అనుకుంటే మొత్తం డబ్బులు తిరిగి చెల్లించాలని లేదంటే లీగల్ గా వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది..ఇరోస్ వారి నిర్ణయం చూస్తుంటే డబ్బు మొత్తం చెల్లించే వరకు సినిమా విడుదలకు అనుమతి తెలిపేలా లేరని తెలుస్తోంది. మరి 14 రీల్స్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: S.S.Rajamouli: ఇప్పటికైనా అర్థమైందా డార్లింగ్.. ప్రభాస్ కు రాజమౌళి స్పెషల్ నోట్!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×