E-Paper
Advertisement

ప్రదీప్ రంగనాథన్ ‘లైక్’ సెన్సార్ పూర్తి… రన్ టైం డీటెయిల్స్ ఇవే!

ప్రదీప్ రంగనాథన్ ‘లైక్’ సెన్సార్ పూర్తి… రన్ టైం డీటెయిల్స్ ఇవే!
Advertisement

LIK Movie censor: ప్రదీప్ రంగనాథన్ పరిచయం అవసరం లేని పేరు. ఈయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈయనకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది డ్యూడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఈ సినిమాతో 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా తర్వాత ఈయన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న LIK..

ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు మూడు రోజుల సమయం ఉండ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక సెన్సార్ బోర్డు ఈ సినిమాకు రన్ టైం కూడా లాక్ చేశారు. ఈ సినిమా రెండు గంటల 36 నిమిషాల 58 సెకండ్ల రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు 2:36 గంటల రన్ టైం అంటే పర్ఫెక్ట్ రన్ టైం అని చెప్పాలి.

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా..

Advertisement

ఇక ఈ సినిమా 2040 లో ప్రేమ కథలు ఎలా ఉంటాయనే నేపథ్యంలో రాబోతుందని ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ కృతి శెట్టి (Kriti Shetty)హీరో హీరోయిన్లుగా నటించగా విలన్ పాత్రలో ఎస్ జె సూర్య నటించబోతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ట్రైలర్ సినిమా పట్ల భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా అప్డేట్స్ చూస్తుంటే ప్రదీప్ రంగనాథ్ వరసగా నాలుగో సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టబోతున్నారని తెలుస్తోంది.

నయనతార నిర్మాణంలో..

Advertisement

ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా… నయనతార ఎస్.ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ పద్మిని సినిమాస్ విడుదల చేస్తోంది.ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ప్రదీప్ రంగనాథ్ తన హిట్ మార్క్ చూయిస్తూ ఈ సినిమాతో మరో హిట్ కొట్టబోతున్నారా? లేదా? అనేది తెలియాలి అంటే ఏప్రిల్ 10వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఇక నయనతార నిర్మాణంలో నయనతార భర్త డైరెక్షన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

Also Read: బుల్లితెర నటికి ఘోర అవమానం.. పిలిచి మరి అవమానించిన బుల్లెట్ భాస్కర్!

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×