E-Paper
Advertisement

LIK Movie: వాయిదా పడ్డ ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?

LIK Movie: వాయిదా పడ్డ ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?

LIK Movie: కోలీవుడ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganatha) ఇటీవల వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నటుడిగా దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇటీవల డ్యూడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK Movie) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

నయనతార నిర్మాణంలో..

ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార(Nayanatara) నిర్మాణంలో దర్శకుడు విగ్నేష్ శివన్ (Vignesh Shivan)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ కు జోడిగా కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక ఈ సినిమాతో కూడా ప్రదీప్ మరో హిట్ అందుకోబోతున్నారని అభిమానులు భావించారు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విడుదల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది . ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 18వ తేదీ విడుదల కాలేదని తెలుస్తోంది.

2026 లోనే విడుదల..

డిసెంబర్ 18వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిందని త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు సమాచారం అయితే సోషల్ మీడియా వార్తలు ప్రకారం ఈ సినిమాని 2026 జులై 17 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా కొత్త విడుదల తేదీ గురించి చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా తెలియజేయునన్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది అయితే మరోసారి కూడా వాయిదా పడిందని తెలుస్తోంది.

టైం ట్రావెల్ చేసే వ్యక్తిగా..

ఇక ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ ప్రేమ కోసం మొబైల్ గాడ్జెట్ ఉపయోగించి 2035 వరకు టైం ట్రావెల్ చేసే వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య కీలకపాత్రలో కనిపించగా, అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్హీరోగా నటించిన లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలు వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన నేపథ్యంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రదీప్ రంగనాథన్ తో పాటు కృతి శెట్టికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇటీవల తెలుగులో సక్సెస్ కు దూరమైన కృతి శెట్టి తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరి అక్కడ ఈమె ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Sonia Akula: పండంటి బిడ్డకు జన్మించిన సోనియా ఆకుల…పేరు ఏంటో తెలుసా?

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×