E-Paper
Advertisement

Sonia Akula: పండంటి బిడ్డకు జన్మించిన సోనియా ఆకుల…పేరు ఏంటో తెలుసా?

Sonia Akula: పండంటి బిడ్డకు జన్మించిన సోనియా ఆకుల…పేరు ఏంటో తెలుసా?
Advertisement

Sonia Akula: సోనియా ఆకుల పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈమె బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కొన్ని వారాలపాటు కొనసాగిన సోనియా (Sonia)ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈమె ప్రముఖ వ్యాపారవేత్త యశ్ వీరగోని(Yash Veeragoni) అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వివాహం తర్వాత సోనియా సైతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన భర్త వ్యాపారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

ఆడపిల్లకు జన్మనిచ్చిన సోనియా..

పెళ్లి తర్వాత ఈ జంట ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో పాల్గొని సందడి చేసి మరింత ఆదరణ కూడా సొంతం చేసుకున్నారు.. ఇక పెళ్లయిన వెంటనే సోనియా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. త్వరలోనే తన తల్లి కాబోతున్నాననే విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా సోనియా అభిమానులకు మరొక గుడ్ న్యూస్ తెలియజేశారు. ఈమె డిసెంబర్ 8వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలియజేశారు. ఇక ఈ విషయాన్ని యష్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇప్పుడు మా కుటుంబం మొత్తం కంప్లీట్ అయింది అంటూ తమ సంతోషాన్ని తెలియజేయడమే కాకుండా తన కూతురి పేరును కూడా ప్రకటించారు.

శిఖ వీరగోని..

Advertisement

తన కుమార్తెను అందరికీ పరిచయం చేస్తూ.. తన పేరు శిఖ వీరగోని(Shikha veeragoni) పెట్టినట్లు ఈ సందర్భంగా యష్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు . పాప పుట్టిందని పాప పేరును తెలియజేసినప్పటికీ పాప ఫోటోని మాత్రం షేర్ చేయలేదు కేవలం తన చేతిని మాత్రమే షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ అందరితో పంచుకున్నారు. ఇక ఈయనకు తన చెల్లి అంటే ఎంతో ప్రాణం అనే సంగతి తెలిసిందే . తన చెల్లి పేరు శ్వేత. శ్వేత మరణించడంతో తన చెల్లిని తలుచుకుంటూ పలు సందర్భాలలో ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక తనకు కూతురు పుట్టడంతో తన చెల్లి పేరు కలిసి వచ్చేలాగా శిఖ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇకపోతే సోనియా యశ్ కు రెండవ భార్య అనే సంగతి తెలిసిందే. ఇదివరకే యష్ వివాహం చేసుకున్నారు. యశ్ మొదటి భార్యకు ఓ కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా కుమారుడు జన్మించిన తర్వాత తన మొదటి భార్య నుంచి విడిపోయిన అనంతరం సోనియాను రెండవ వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు కూడా ఒక కుమార్తె జన్మించడంతో మా ఫ్యామిలీ కంప్లీట్ అయింది అంటూ ఈయన తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులతో పాటు బుల్లితెర నటీనటులు కూడా ఈ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు .

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×