Pragya Jaiswal:ప్రగ్యా జైస్వాల్ … కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి దూసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అఖండ వంటి సినిమాలు చేసినప్పటికీ ఎందకనో టాప్ లీగ్ లోకి దూసుకురాలేకపోయింది. అయితే సినిమాలు తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ పిక్స్ వదులుతూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇపుడు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంది. “Summer is back and I’m not complaining” అనే క్యాప్షన్ తో ఒక క్రేజీ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఎనర్జీని నింపింది. ఎండలు బాగా మండిపోతున్నాయి అని కంప్లైంట్స్ ఇవ్వకుండా ఈ సీజన్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేయాలనే సందేశం ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రగ్యా జైస్వాల్ విషయానికి వస్తే సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనదైన స్టాంప్ వేయడం తనకి అలవాటే. ఫ్యాషన్, ట్రావెల్, ఫిట్‌నెస్ అప్‌డేట్స్ పంచుకుంటూ అభిమానులకు డైలీ టచ్ లో ఉంటుంది కూడా.ఇక ఈ క్రమంలోనే ఆమె పెట్టే ప్రతి ఫొటోషూట్ లేదా వెకేషన్ పిక్స్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
తాజాగా చేసిన ఈ పోస్ట్ కూడా ఆమె గ్లామర్, లైఫ్‌స్టైల్ టేస్ట్ ఏంటో క్లియర్ గా చెప్పేస్తుంది.ఇందులో ఉన్న ఆమె గ్లామరస్ లుక్స్ అభిమానులకు మంచి విజువల్ ట్రీట్‌గా మారాయి. దీంతో ప్రగ్యా ఈజ్ బ్యాక్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే పిక్స్ తగ్గించి సినిమాలు చేయొచ్చుగా అంటూ మరికొంతమంది సజీషన్ ఇస్తున్నారు.
ప్రగ్యా జైస్వాల్ మోడల్ గా కెరీర్ మొదలెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్రిష్ తెరకెక్కించిన చారిత్రక ప్రేమకథా చిత్రం ‘కంచె’లో తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ఆ చిత్రంలో ప్రగ్యా కనబరిచిన నటన, హోమ్లీ లుక్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి కూడా .
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ, నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ‘అఖండ’ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి, ప్రగ్యాకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.అయితే ఆ జోష్ ని తర్వాత కంటిన్యూ చేయకపోవడం గమనార్హం .
ALSO READ:రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఈ ఫొటోల తర్వాత, ప్రగ్యా నుంచి ఎలాంటి కొత్త సినిమా ప్రకటనలు రానున్నాయో, ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి !