Shreya Ghoshal:శ్రేయా ఘోషల్ …ఈ పేరు తెలీని మూవీ లవర్ ఉండరంటే ఆశ్చర్యం లేదు. తనదైన గొంతుతోఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది సంగీతాభిమానులను అలరిస్తున్న ఈ స్టార్ సింగర్
ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నోజ్ఞాపకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె తండ్రి బిశ్వజిత్ ఘోషల్ అందించిన ప్రోత్సాహమే ఈ రోజు శ్రేయాను ఇండియాస్ బెస్ట్ సింగర్ గా నిలబెట్టాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రేయ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తన చిన్నతనంలో టీవీ రియాలిటీ షో ‘సరిగమప’ షూటింగ్ పూర్తి చేసుకుని తండ్రితో కలిసి రైలులో ప్రయాణిస్తూ ఇంటికి తిరిగి వస్తున్నామని,అదే సమయంలో ఆమెకు జీవితంలో మొదటిసారి పీరియడ్స్ వచ్చాయని తెలిపింది .
పైగా పక్కన తండ్రి మాత్రమే ఉన్నారని ఆ వయసులో ఏం జరుగుతుందో అర్థం కాక శ్రేయ ఫుల్ టెన్షన్ పడిపోయానని కాని వెంటనే ఏమాత్రం దాచకుండా వెంటనే తన తండ్రికి అసలు విషయం చెప్పానని ఆనాటి సంఘటనని గుర్తు చేసుకున్నారు.
ఇక తన తండ్రి ఏమాత్రం సంకోచించకుండా ఒక స్నేహితుడిలా ఆమెను ఓదార్చారని , ప్రయాణం మధ్యలో ఉన్నందున ఏమీ చేయలేక ధైర్యం చెప్తూ తాత్కాలికంగా ఒక సర్దుబాటు చేశారని తెలిపింది.
ఇక ఇంటికి చేరుకున్న వెంటనే నేరుగా షాపుకు వెళ్లి శానిటరీ ప్యాడ్స్ కొని తెచ్చి ఇచ్చారని తెలిపింది శ్రేయా.కాలం మారినా పీరియడ్స్ అనే మాట ఎత్తడానికే ఆలోచించే రోజుల్లో ఒక తండ్రిగా ఆయన చూపించిన చొరవ శ్రేయ మనసులో చెరిగిపోని ముద్ర వేసిందనే చెప్పాలి.
ఇక శ్రేయా కెరీర్ విషయానికి వస్తే 2002లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఐకానిక్ సినిమా ‘దేవదాస్’ ద్వారా ఎంట్రీ ఇచ్చింది శ్రేయా ఘోషల్. అందులో ఆమె పాడిన “డోలా రే డోలా”, “బైరీ పియా” పాటలు ఎంతలా వైరల్ అయ్యాయో చెప్పక్కర్లేదు.
ఇక తెలుగులో 2002లోనే వచ్చిన ‘నువ్వు లేక నేను లేను’ సినిమాలోని “ఏదో ఏదో అయిపోతోంది” పాటతో టాలీవుడ్ కు పరిచయమైంది. ‘ఒక్కడు’ (2003) లోని “నువ్వేం మాయ చేశావో గానీ”, ‘అతడు’ (2005) లోని “పిల్లగాలి అల్లరి”, ‘మగధీర’ (2009) లోని “ధీర ధీర” అంటూ ఎన్నో వందల సినిమాలకి పాటలు పాడి మెప్పించింది.
ALSO READ:ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?
ఏది ఏమైనా పీరియడ్స్ అనేది దాచే విషయమో, లేదా సిగ్గుతో బాధపడే విషయమో కాదు అంటూ శ్రేయా చెప్పిన ,మాటలు ఇపుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.