E-Paper
Advertisement

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!
Advertisement

Bus Accident: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారంహైదరాబాద్‌-1 డిపోకు చెందిన బస్సు నంబర్‌ టీఎస్34జడ్0030 (ఎక్స్‌ప్రెస్‌), సర్వీస్‌ నంబర్‌ బ్యాక్ 3, హైదరాబాద్‌ నుంచి బిచ్కుంద వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిచ్కుంద సమీపంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ అంజనేయులు బస్సు కింద చిక్కుకుని మృతి చెందారు.

ఇరుక్కున్న డ్రైవర్..

ఆ సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి స్వల్ప గాయాలు కాగా, బిచ్కుంద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బస్సులో ఇరుక్కున్న డ్రైవర్ మృత దేహాన్ని బయటకు తీసి బస్సును తొలగించారు.

Advertisement

Also read: కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

డ్రైవర్ మృతికి తీవ్ర దిగ్భ్రాంతి..

జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్ ఆంజనేయులు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా బయటపడ్డప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశామన్నారు.

Advertisement

Also read: పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×