418 Movie trailer:డార్క్ థీమ్ తో మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ మాస్ ఆడియన్స్ కి ఫేవరెట్ డైరెక్టర్గా మారిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఈసారి మాత్రం ఆడియన్స్ ను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నడగౌడ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 418- ది నైట్ మేర్ బిగిన్స్. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా అక్టోబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోను బట్టి చూస్తే ఈ సినిమా పూర్తిగా ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ నేపథ్యంలో సాగనున్నట్లు అర్థమవుతుంది. సుమారుగా 15 సంవత్సరాలుగా ఎవరికి ప్రవేశం లేని మూసి ఉన్న 418 నంబర్ గది చుట్టూ అంత చిక్కని రహస్యాలు, భయానక సంఘటనలు తిరుగుతూ ఉంటాయి. అసలు ఆ రూమ్ లోపల ఏముంది? దాని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు మెడికల్ కాలేజీ విద్యార్థుల ప్రయత్నాలలో ఎదురయ్యే ఊహించని, భయానక అనుభవాలతో ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠ భరితంగా రూపొందించారు. సాధారణ జంప్ స్కేర్లకు దూరంగా చాలా ఇంటెన్సివ్ గా గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్ తో ఈ ట్రైలర్ హారర్ ప్రియులను బాగా కట్టిపడేస్తోంది. నటి చైత్ర ఆచార్ నటన, ఆమె పలికించిన భయానక హావ భావాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ట్రైలర్ మొదలవగానే కూచిపూడి నాట్య కళాకారులను చూపించారు. ఆ తర్వాత నేను తల్లినవ్వాలి.. తల్లిని అయి తీరాలంతే అంటూ ఒక మహిళ చెప్పే డైలాగ్ తో ఆసక్తిని పెంచేశారు. ఇక ఆ తర్వాత ఒక స్టూడెంట్.. రేయ్ ఆ రూమ్ ఒక స్టోర్ రూమ్.. అంతే.. అయినా ఇన్నాళ్లు నీ హాస్టల్ ఎందుకు మోతబడిందో తెలుసా ? ఆ ఒక్క రూమ్ వల్ల.. ఆ చోటే ఒక అపశకునం.. అసలు ఆ రూమ్ లో ఏముందో తెలిస్తే భయం ఉండదు కదా.. అనే డైలాగులు వస్తున్నప్పుడు అటు హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గదిలోకి అమ్మాయి రాక ఆ తర్వాత ఎదురయ్యే భయాలు, భయానక దృశ్యాలు థియేటర్లలో సీట్ ఎడ్జ్ న కూర్చోబెడతాయి అనడంలో సందేహం లేదు. మొత్తానికైతే వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
also read:కావ్య శ్రీతో ఏడు అడుగులు వెయ్యబోతున్న సుధీర్..ఇదెక్కడి ట్విస్ట్ మావా?
ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ ఎర్నేని , వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఒక పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 23న ప్రేక్షకులందరికీ ఈ చిత్రానికి వెంకీ జీజీ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇకపోతే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఏ (A)సర్టిఫికెట్ లభించింది.